వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిగ్ టికెట్ లక్కీ డ్రా‌లో ఏడుగురు భారతీయులకు జాక్‌పాట్

By Narsimha
|
Google Oneindia TeluguNews

దుబాయ్: అబుదాబి 'బిగ్‌ టికెట్‌ లక్కీ డ్రా'లో ఏడుగురు భారతీయులకు జాక్‌పాట్‌ తగిలింది. ఈ లక్కీ డ్రాలో వరించిన 8 మంది విజేతలుగా నిలిచారు.ఈ ఎనిమిది మందిలో ఏడుగురు భారతీయులు కావడం విశేషం. ఈ లక్కీ డ్రాలో ఏడుగురు భారతీయులు భారీ మొత్తం గెల్చుకున్నారు.

సోమవారం అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించిన లక్కీ డ్రాలో భారతీయుల పంట పండింది. కేరళకు చెందిన థాన్సిలాస్‌ బాబు మాథ్యూస్ 7 మిలియన్ల దినార్‌లు (దాదాపు 12.5 కోట్లు) గెలుచుకున్నాడు. ఈ లాటరీ తగటడం నమ్మలేకపోతున్నానని థాన్సిలాస్‌ ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

Indian expat wins Dh7 million in Big Ticket Abu Dhabi raffle

గత నెలలో రాఫెల్‌ బొనాంజా బిగ్‌ లక్కీ మిలియనీర్‌ లాటరీ టికెట్‌ నెంబర్‌ 030202 కొనుగోలు చేయగా, డ్రాలో పెద్ద మొత్తమైన 12.5 కోట్లు గెలుచుకున్నాడు.ఇదే డ్రాలో మరో ఆరుగురు భారతీయులు ఒక్కొక్కరు దాదాపు 18 లక్షలు గెలుపొందారు.

బిగ్‌ టికెట్‌ లక్కీ డ్రా విజేతల్లో ఏడుగురు భారతీయులు కాగా, బెహ్రెయిన్‌ కు చెందిన మరో వ్యక్తి ఉన్నారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు చేతులకు రావడంతో విజేతలు అమితాశ్చర్యానికి గురయ్యారు. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

English summary
Indian expat Thansilas Babu Mathew has just won Dh7 million in a raffle in Abu Dhabi.Thansilas, who had purchased ticket no. 030202 in Big Ticket Abu Dhabi, was announced as the winner of the bumper prize on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X