ఉక్రెయిన్‌లో పరిస్థితులు దారుణం.. నీళ్లు, టార్చ్, డబ్బులు వెంట ఉంచుకోండి.. భారతీయులకు సూచనలు
ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. వరుస దాడులతో ఖర్కివ్ అట్టుకడుకుంది. ఎటూ చూసినా భయానక పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఖేర్సన్ నగరాన్ని ఇప్పటికే రష్యా సైనికుల వశమైంది. ఖర్కివ్‌ను హత్తగతం చేసుకునేందుకు భీకరంగా ప్రయత్నిస్తున్నారు. క్షిపణులతో విరుచుకుపడుతోంది.
భారతీయుల కోసం దరఖాస్తు
ఈ నేపథ్యం ఖర్కివ్‌లో చిక్కుకున్న భారతీయులను ఉక్రెయిన్ లోని భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది. అత్యవసర ప్రాతిపదికన ఓ దరఖాస్తు నింపాలని భారత పౌరులకు సూచిస్తూ ట్విట్ చేసింది. దానికి సంబంధించిన ఫామ్ ను పోస్టు చేసింది. పిసచిన్ మినహా ఖర్కివ్ లో ఉన్న భారతీయ పౌరులందరూ ఆ దరఖాస్తులో తమ వివరాలను నింపాలని ట్విట్ చేసింది.

టార్చ్, నీళ్లు, డబ్బులు వెంట ఉంచుకోండి
రష్యా వైమానిక, డ్రోన్, క్షిపణి దాడులతో భవనాలు కూలిపోతున్నాయి. ఖర్కిన్ లో రష్యా దళాలు విరుచుకుపడుతుండడంతో ఆ నగరంలో చిక్కుకుపోయిన భారతీయుల కోసం కేంద్రప్రభుత్వం పలు మార్గదర్శకాలు జారీ చేసింది. విద్యుత్, ఆహారం , నీటి కొరత వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఖర్కిన్‌లో ఉన్నవారంతా తమ వెంట టార్చ్, డబ్బులు, నీళ్లు తమ వెంట ఉంచుకోవాలి సూచించింది. కనీసం పదిమంది చొప్పున బృందాలుగా ఏర్పడాలని భారతీయులు స్పష్టంచేసింది.

ఆపరేషన్ గంగ
అటు ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను ఆపరేషన్ గంగ ద్వారా కేంద్ర ప్రభుత్వం వారిని స్వదేశానికి తిరిగి తీసుకువస్తోంది. రష్యా దాడి నేపథ్యంలో 18 వేల మంది భారత పౌరులు ఉక్రెయిన్ వీడారని కేంద్రం వెల్లడించింది. మరో 6400 మందిని భారత్‌కు తరలించేందుకు 30 విమనాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. వచ్చే రెండు మూడు రోజుల్లో పెద్ద సంఖ్యలో ఉక్రెయిన్ నుంచి భారతీయలు భారత్‌కు చేరుకోనున్నారని పేర్కొంది.