వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవమానం: గురుద్వారాలోకి వెళ్లేందుకు భారత హైకమిషనర్‌ను అనుమతించని పాక్ అధికారులు

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌లోని భారత హైకమిషనర్‌ అజయ్ బిసారియాకు మరోసారి ఘోర అవమానం జరిగింది. ఆయన పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని ఇస్లామాబాద్‌లోని గురుద్వారా పంజా సాహిబ్‌లోకి ప్రవేశించేందుకు అక్కడి అధికారులు అడ్డుచెప్పారు. గురుద్వారాలోకి వెళ్లేందుకు పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల శాఖ నుంచి అన్ని అనుమతులు ముందే తీసుకున్నప్పటికీ గురద్వారా దగ్గర మాత్రం అజయ్ బిసారియాను లోపలికి వెళ్లేందుకు అనుమతిని నిరాకరించారు.

బిసారియాకు ఇలా అవమానం జరగడం ఇది తొలిసారి కాదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో గురుద్వారాకు సంబంధించిన ట్రస్ట్ ఆయన్ను ఆహ్వానించింది. అయితే భద్రతా కారణాలను చూపుతూ పాక్ అధికారులు ఆయన్ను గురద్వారా లోపలికి అనుమతించలేదు. ఒక్క బిసారియానే కాదు, భారత కాన్సులేట్‌లో పనిచేసే ఎవరినీ అధికారులు గురుద్వారాలోపలికి అనుమతించలేదని సమాచారం.

 Indian High commissioner to Pak denied entry into Gurudwara

ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇది పాకిస్తాన్‌కు తగదని పేర్కొంది. ప్రార్థనలు చేసుకునేందుకు భారతీయ అధికారులు గురుద్వారకు వస్తే తప్పేంటని ప్రశ్నించింది. కేవలం భారతీయులు కాబట్టే పాక్ ఇలా డొంకతిరుగుడు కారణాలు చూపిస్తోంది అని ఆరోపించింది. దీనిపై పాక్ ప్రభుత్వం వివరణ ఇవ్వాలని భారత్ డిమాండ్ చేసింది.

English summary
India's High Commissioner to Pakistan Ajay Bisaria reportedly not allowed to enter the Gurdwara Panja Sahib near Islamabad despite having the requisite permission from Pakistan's Ministry of Foreign Affairs.Bisaria along with his wife, had gone to pray at the gurdwara, on the occasion of his birthday with proper documents. However, Pakistani authorities reportedly not allowed to leave their vehicle.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X