వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ బ్యాగులో రూ. 50 లక్షల విలువైన బంగారం, డబ్బు: భారతీయుడికి దుబాయ్ పోలీస్ సెల్యూట్

|
Google Oneindia TeluguNews

దుబాయ్: యూఏఈలో ఓ భారతీయుడు తన నిజాయితీని చాటుకున్నాడు. దీంతో అక్కడి పోలీసులు, అధికారులు అతడ్ని ప్రశంసలతో ముంచెత్తారు. అంతేగాక, అవార్డుతో సంత్కరించి కృతజ్ఞతలు కూడా చెప్పారు. భారతీయుల గొప్పతనాన్ని చాటిన ఆయన చేసిన పని ఎంతమాత్రమూ చిన్నది కాదు.

ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. రితేశ్ జేమ్స్ గుప్తా అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా దుబాయ్‌లో ఉంటున్నారు. శనివారం గుప్తాకు ఓ ప్రాంతంలో ఒక బ్యాగ్ కనిపించింది. తెరిచి చూస్తే అందులో 14వేల అమెరికన్ డాలర్లు(సుమారు రూ. 10లక్షలకుపైగానే) నగదు, 2 లక్షల దిర్హామ్‌లు(సుమారు రూ. 40లక్షలు) విలువ చేసే బంగారం ఉంది.

Indian in UAE returns bag containing USD 14,000, gold; honoured: Report

ఇంత ధనం చూశాక ఎవరైనా ఏం చేస్తారు? గప్‌చుప్‌గా ఆ బ్యాగును పట్టుకుని చెక్కేస్తారు. కానీ, రితేశ్ గుప్తా ఆ పని చేయలేదు. నేరుగా సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆ బ్యాగును పోలీసులకు అప్పగించారు. గుప్తా నిజాయితీని చూసి పోలీసు అధికారులు ఆశ్చర్యచకితులయ్యారు.

బాధ్యతగల పౌరుడిగా వ్యవహరించారంటూ అతడ్ని పొగడ్తలతో ముంచెత్తారు. గుప్తా నిజాయితీకి గుర్తింపుగా ఆయనకు 'సర్టిఫికేట్ ఆఫ్ అప్రిసియేషన్'ను అందజేశారు. పోలీసులు.. పౌరుల మధ్య సహకారం పెరగడానికి ఇలాంటి ఘటనలు ఎంతో దోహదం చేస్తాయని స్థానిక పోలీస్ అధికారి యూసుఫ్ అబ్దుల్లా సలీమ్ అల్ అదిదివ్యాఖ్యానించారు.

Recommended Video

India కు China వార్నింగ్, రాజ్‌నాథ్ హెచ్చరికపై ఘాటు రియాక్షన్ - భారత్ రెచ్చగొడుతున్నది అంటూ అక్కసు

ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో ఆ బ్యాగ్ ఎవరిదన్నది తెలియరాలేదు. దీంతో
ఆ బ్యాగ్ ఎవరిదన్న విషయంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, తనకు అవార్డును ఇవ్వడం పట్ల గుప్తా దుబాయ్ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. తనకు ఇది ఎంతో ఆనందాన్నిచ్చిందని, గర్వంగా ఉందని చెప్పారు.

English summary
An Indian in the UAE was honoured by the police for returning a bag containing USD 14,000 and gold, a media report said on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X