వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమాజహితమే ఆమె అభిమతం..నగ్నంగా సైకిల్ ర్యాలీ చేసింది

By Narsimha
|
Google Oneindia TeluguNews

లండన్ :పర్యావరణాన్ని పరిరక్షించేందుకు, మానవత్వాన్ని ప్రచారం చేసేందుకు ఒ మహిళ నగ్నంగా ర్యాలీ చేస్తోంది. పుట్టే సమయంలో బట్టలు లేవు, చనిపోయిన తర్వాత బట్టలు ఉండవు అంటూ ఆ మహిళ తన నిర్ణయాన్ని సమర్థిస్తోంది.

లండన్ లో మీనాల్ జైన్ అంటే అందరికీ తెలిసిన పేరు. ఈ మె భారతీయ మహిళ. ఈమె లండన్ లో నివాసం ఉంటుంది. ఈమె గురించి ఇండియాలో అంతగా తెలియకున్నా లండన్ లో మాత్రం ఆమె గురించి చాలా మందికి తెలుసు.

తాను చేపట్టిన కార్యక్రమాల ద్వారా ఆమె లండన్ వాసులకు సుపరిచితమే.లండన్ లో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీని ఆమె నిర్వహిస్తోంది. నగ్నత్వం గురించి ఆమె ప్రచారం చేస్తోంది.నగ్నత్వానికి వ్యతిరేకించడాన్ని ఆమె సమర్థించదు.

indian lady cycle rally without dress in london

పర్యావరణ హితం కోసం నగ్నంగా సైకిల్ ర్యాలీ

ఒంటిమీద నూలుపోగు లేకుండా ఉండడం అనేది సాదారణ విషయం కాదు. కాని మీనాల్ జైన్ మాత్రం ఒంటిమీద బట్టలు లేకుండా వందలాది మంది నిలబడింది. సముద్రతీర ప్రదేశాలతో పాటు సమాజహితం కొసం ఆమె బట్టలు లేకుండా కార్యక్రమాలను నిర్వహించింది. ఈ కార్యక్రమాల ద్వారానే ఆమె లండన్ లో ప్రసిద్ది చెందింది.

పర్యావరణాన్ని రక్షించేందుకుగాను మీనాల్ .జైన్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో మానవత్వ విలువలకు దూరంగా ఉండడాన్ని కూడ ఆమె తప్పుబడుతోంది. మానవత్వాన్ని కాపాడాలని, పర్యావరణాన్ని రక్షించాలని కోరుతూ మీనాల్ లండన్ లో సైకిల్ ర్యాలీ నిర్వహించింది. ఈ రకమైన ర్యాలీ నిర్వహించిన తొలి భారతీయ మహిళగా ఆమె రికార్డును సాధించింది.పుట్టినప్పుడు, చనిపోయిన తర్వాత బట్టలు ఉండవు, మద్యలో బట్టలు ఎందుకు అవసరమా అని ఆమె ప్రశ్నిస్తోంది. తాను నిర్వహించే బ్లాగ్ లో కూడ నగ్నత్వం గురించి ప్రచారం చేస్తోంది

English summary
meenaaljain cucle rally without clothes in london. she is indian. but she livining in london. she running a software company in london. she is awareness about environment,humanities recently she has rally without dress in london.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X