అయోధ్య రాముడు డ్రాగన్‌ను చంపేస్తాడు: తైవాన్, హాంకాంగ్ సంబరాలు, నెటిజన్ల ఐక్యత
తైపీ: భారత్-చైనా సరిహద్దులోని గాల్వన్ లోయలో నాలుగు రోజుల క్రితం ఇరు దేశాల సైనికులు మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. చైనా దళాలు దొంగదెబ్బతీసి భారత సైనికులపై కత్తులు, ఫెన్సింగ్ చుట్టిన ఇనుపరాడ్లతో దాడులు చేశాయి. ఈ దాడుల్లో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు.
డ్రాగన్ ఘాతుకం: కల్నల్ సంతోష్, ఇతర సైనికుల పోస్టుమార్టం రిపోర్టుల్లో సంచలన విషయాలు

తైవాన్, హాంకాంగ్ పండగ చేసుకుంటున్నాయి..
అయితే, భారత సైనికులు జరిపిన ప్రతిదాడులో సుమారు 43 మంది చైనా సైనికులు హతమైనట్లు వార్తలు వచ్చాయి. కాగా, చైనా సైనికులు హతం కావడం పట్ల డ్రాగన్ దేశం అంటే గిట్టని తైవాన్, హంకాంగ్ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. తమ దేశాలను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తుండటంపై ఇప్పటికే తైవాన్, హంకాంగ్లు తీవ్ర నిరసనలు, పోరాటాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత సైన్యం డ్రాగన్ సైనికులు కుటిల యత్నాలను తిప్పికొట్టిందనే విషయం తెలియగానే పండగ చేసుకుంటున్నాయి.
డ్రాగన్‌పై బాణం ఎక్కుపెట్టిన రాముడు
అంతేగాక, అయోధ్య రాముడిని తైవాన్ పత్రిక ప్రముఖంగా ప్రచురితం చేసింది. భారత శ్రీరాముడు డ్రాగన్‌పైకి బాణం ఎక్కుపెట్టినట్లున్న ఫొటోను తైవాన్, హంకాంగ్ ప్రజలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. హాంకాంగ్ కు చెందిన సోషల్ మీడియా సైట్ ఎల్ఐహెచ్కేజీలో ఈ పొటోను ముందుగా పోస్ట్ చేశారు. ట్విట్టర్ యూజర్ హోసైలీ దాన్ని చేశారు. దీన్ని తైవాన్‌కు చెందిన తైవాన్ న్యూస్.కామ్ ప్రముఖంగా ప్రస్తావించింది. ఫొటో ఆఫ్ ది డే అంటూ కథనాన్ని ప్రచురించింది.

భారత్‌కు మద్దతుగా..
తైవాన్, హాంకాంగ్ ప్రజలు ఇప్పటికే చైనా పేరెత్తితేనే అగ్గిమీదగుగ్గిలమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత్‌కు ఈ రెండు దేశాల ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. కాగా, ఈ శ్రీరాముడి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భారత ప్రజలు కూడా ఆ రెండు దేశాలకు మద్దతుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే చైనాకు శత్రు దేశాలు ఎక్కువగానే ఉన్నాయనే విషయం అర్థమవుతోందంటున్నారు.