వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మైనర్‌పై లైంగికదాడి, తప్పుడు సమాచారంతో అమెరికా పౌరసత్వాన్ని కోల్పోయిన ఇండియన్

9 ఏళ్ళ చిన్నారిపై లైంగికదాడికి పాల్పడిన నేరాన్ని దాచడంతోపాటు తప్పుడు మార్గంలో అమెరికా శాశ్వత పౌరసత్వాన్ని పొందేందుకు ప్రయత్నించిన భారతీయ అమెరికన్ గురుప్రీత్‌సింగ్‌ అమెరికా పౌరసత్వాన్ని .

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: 9 ఏళ్ళ చిన్నారిపై లైంగికదాడికి పాల్పడిన నేరాన్ని దాచడంతోపాటు తప్పుడు మార్గంలో అమెరికా శాశ్వత పౌరసత్వాన్ని పొందేందుకు ప్రయత్నించిన భారతీయ అమెరికన్ గురుప్రీత్‌సింగ్‌ అమెరికా పౌరసత్వాన్ని కోల్పోనున్నాడు.

ప్రస్తుతం ఈ కేసు విచారణ సాగుతోంది. ఇది తుది దశలో ఉన్నప్పటికీ అతడు అధికారులకు సహకరించని కారణంగా అతడి పౌరసత్వాన్ని రద్దుచేసి బహిష్కరించనున్నారు.

 Indian to Lose US Citizenship After Being Convicted of Fraud

గురుప్రీత్‌సింగ్ అనే వ్యక్తి వాటర్‌టౌ‌న్‌లో నివాసం ఉంటున్నాడు. ఇటీవలనే ఓ చిన్నారిపై అతను లైంగికదాడికి పాల్పడ్డాడు. అయితే అతడిని పోలీసులు అరెస్టు చేశారు. సిరాకస్ ఫెడరల్ కోర్టులో మూడునెలల శిక్ష కూడ విధించింది.

అయితే అదే సమయంలో అతడు తన పౌరసత్వం కోసం ధరఖాస్తు చేసుకొన్నాడు. పౌరసత్వాన్ని ధృవీకరించే క్రమంలో భాగంగా యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ అధికారుల ముందు హజరై అతడు తాను చేసిన నేరాన్ని చెప్పలేదు.

ఆయనకు పలుమార్లు అవకాశమిచ్చినా తనపై ఏ కేసు లేదని ఏ తప్పు చేయలేదని అరెస్ట్ కాలేదని అబద్దం చెప్పాడు. కానీ, అతడు నేరం చేసినట్టు, అరెస్టైనట్టు ఆధారాలు తెప్పించుకొన్న ఇమ్మిగ్రేషన్ అధికారులు అతడి తప్పును గుర్తించి పౌరసత్వాన్ని త్వరలో రద్దుచేయనున్నారు. అమెరికా పౌరసత్వం ఖరారుచేసే సమయంలో ఆ వ్యక్తి ఎలాంటి నేరానికి పాల్పడినా అది ఆమోదం పొందదు.

English summary
A 37-year-old man from India is set to lose his American citizenship after he was convicted of fraud and not disclosing to immigration authorities that he had sexually abused a 9-year-old child.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X