వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంచలనం: ఆ దేశానికి రాజుగా మన భారతీయ యువకుడు!

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

బిర్ తావిల్: నేనే రాజు.. నేనే మంత్రి సినిమా ఇన్‌స్పిరేషనో ఏమో తెలియదుగానీ.. ఓ భారతీయ యువ వ్యాపారవేత్త ఓ వివాదాస్పద ప్రాంతంలోకి వెళ్లి తనను తానే ఆ ప్రాంతానికి రాజుగా ప్రకటించుకున్నాడు.

వివరాల్లోకి వెళ్తే... ఈజిప్టు, సుడాన్‌ దేశాల సరిహద్దుల నడుమ 2060 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న కొంత భూభాగం వివాదాస్పదంగా మారింది. ఆ ప్రాంతం తమది కాదంటే తమది కాదంటూ రెండు దేశాలు పరస్పరం వాదించుకుంటున్నాయి.

అది ఉగ్రవాదులు సంచరించే ప్రాంతం కావడంతో రెండు దేశాలు ఆప్రదేశంపై వెనక్కి తగ్గాయి. ఇదే అదనుగా ఇండోర్‌కు చెందిన యువ పారిశ్రామిక వేత్త సుయాష్‌ దీక్షిత్‌(24) కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించి బిర్‌తావిల్‌కు చేరుకున్నాడు.

Indian man claims 800-square-mile strip of land between Egypt and Sudan as his own country

ఆ వివాదాస్పద ప్రాంతంలో జెండా పాతాడు. ఆ ప్రదేశానికి తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు. ఆ ప్రాంతానికి 'కింగ్‌డమ్‌ ఆఫ్‌ దీక్షిత్‌' అని పేరు కూడా పెట్టకున్నాడు.

అంతటితో ఊరుకోలేదు. అక్కడ ఓ విత్తనం నాటి నీరు కూడా పోశాడు. ఇక నుంచి ఈ ప్రాంతానికి రాజును నేనేనంటూ సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా ఆ దేశానికి అధ్యక్షుడిగా తన తండ్రి పేరు ప్రకటించాడు.

'హ్యాపీ బర్త్‌డే పప్పా..' అంటూ తన వాల్‌పై రాసుకున్నాడు. అనంతరం 'కింగ్‌డమ్‌ ఆఫ్‌ దీక్షిత్‌'ను దేశంగా పరిగణించాలంటూ ఐక్యరాజ్యసమితికి ఆన్‌లైన్‌లో ఓదరఖాస్తు కూడా పెట్టుకున్నాడు. ఇప్పటి వరకూ తనకు 800 మంది మద్దతు పలికారని అతడు పేర్కొన్నాడు.

ఇవీ కింగ్‌డమ్‌ ఆఫ్‌ దీక్షిత్‌ వివరాలు...

దేశం పేరు: కింగ్‌డమ్‌ ఆఫ్‌ దీక్షిత్‌, జెండా: పైన చిత్రంలో కనిపిస్తోంది. ప్రస్తుత జనాభా: 1
రాజధాని: సుయాష్‌పూర్‌, పాలకుడు: సుయాష్‌ రాజు, ఏర్పాటు తేది: నవంబర్‌ 5, 2017
కింగ్‌డమ్‌ ఆఫ్‌ దీక్షిత్‌ జాతీయ జంతువు: బల్లి.

English summary
An Indian man claims to have established his own kingdom after travelling to a no-man's land between Egypt and Sudan and declaring it his own.Suyash Dixit 'founded' the Kingdom of Dixit on the unclaimed land of Bir Tawil, an 800-square-mile strip of land south of the Egyptian border.While Bir Tawil is legally unclaimed territory, several people have attempted to colonise it over the years, including a Russian amateur radio enthusiast and an American man who wanted to make his daughter a real-life princess.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X