వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శృంగారంలో హీరోలు.. కండోమ్‌ వాడకంలో జీరోలు: ఇదీ మనదేశ మగాళ్ల పరిస్థితి

|
Google Oneindia TeluguNews

జూలై 11 ప్రపంచ జనాభా దినోత్సవంను పాటిస్తున్నాం. జనాభా పెరుగుదలకు రకరకాల కారణాలున్నాయి. ప్రధానంగా ప్రజల్లో అవగాహన లేకపోవడంతో జనాభా పెరిగిపోతోంది. కొందరు తమ స్వయం తృప్తి కోసం పలు జాగ్రత్తలు తీసుకోవడం మరిచిపోతున్నారు. దాని ఫలితమే జనాభా పెరుగుదల. స్త్రీ పురుషుడు లైంగికంగా కలిసిన సమయంలో పలు జాగ్రత్తలు పాటించడం లేదని ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు చేసిన పరిశోదనల్లో వెల్లడైంది. శృంగారం అనేది మానవుడికి ఎంత అవసరమో జనాభా నియంత్రణ కూడా అంతే అవసరం.

శృంగారంలో హీరోలు.. కండోమ్‌ వినియోగంలో జీరోలు

శృంగారంలో హీరోలు.. కండోమ్‌ వినియోగంలో జీరోలు

ఇక భారతీయ పురుషులు శృంగారంలో ఎంత చురుగ్గా ఉంటారో తగు జాగ్రత్తలు తీసుకోవడంలో అంతకుమించి ఉదాసీనతను ప్రదర్శిస్తారని ఓ పరిశోధన వెల్లడించింది. పురుషులు కండోమ్‌లు వినియోగించడంలో చాలా వెనకబడి ఉన్నారని ఓ నివేదిక వెల్లడించింది. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే 94.4 శాతం మంది పురుషులు కండోమ్‌లను వినియోగించేందుకు ఇష్టపడరట. కండోమ్ వినియోగం గురించి పురుషులకు అవగాహన ఉంది కానీ శృంగార సమయంలో దానిని వినియోగించేందుకు ఇష్టపడరని నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే చెబుతోంది.

 రకరకాల ఫ్లేవర్లలో దొరుకుతున్న కండోమ్‌లు

రకరకాల ఫ్లేవర్లలో దొరుకుతున్న కండోమ్‌లు

ఇక కండోమ్‌లు పలు ఫ్లేవర్లో వస్తున్నప్పటికీ వాటిని ధరించేందుకు పురుషులు ఇష్టపడటం లేదంటే అది నిరోధ్‌ల వినియోగంపై పురుషులు ఎంత ఉదాసీనతతో వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది. ఉదాహరణకు మార్కెట్లో లభించే కండోమ్‌లు స్ట్రాబెర్రీ, లిచి, బనానా, పీచ్, చాక్లెట్, పాన్ , ఆమ్ పన్నా, కచ్చా ఆమ్‌లాంటి ఫ్లేవర్లలో వస్తున్నాయి. అంతేకాదు ప్రభుత్వం కూడా కండోమ్‌లను ఉచితంగానే సరఫరా చేస్తున్నప్పటికీ వాటిని వినియోగించడం లేదు. ఇక కండోమ్‌లపై ఎన్ని అడ్వర్టైజ్‌మెంట్లు వచ్చినప్పటికీ కూడా పురుషులు మాత్రం దాని వంక చూడటం లేదట. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకుంటే జనాభా జెట్ స్పీడ్‌తో పెరగక ఏమవుతుందని ప్రశ్నిస్తున్నారు నిపుణులు.

 కండోమ్ వినియోగంలో తెలుగు రాష్ట్రాలు

కండోమ్ వినియోగంలో తెలుగు రాష్ట్రాలు


ఇక ఈ మధ్యే విడుదలైన నేషనల్ హెల్త్ ప్రొఫైల్ 2018ను పరిశీలిస్తే 15 ఏళ్ల నుంచి 49 ఏళ్లు మధ్య ఉన్న వివాహితులు శృంగార సమయంలో కండోమ్‌లు వినియోగించడం లేదని తమ సర్వే ద్వారా వెల్లడైనట్లు తెలిపింది. సాధారణంగా పిల్లలకు జన్మనిచ్చే ఆస్కారం ఉన్నవారు ఈవయస్సు వారే ఎక్కువగా ఉంటారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే కండోమ్ వినియోగంలో ఆంధ్రప్రదేశ్‌లో చివరిస్థానంలో ఉంది. ఇక్కడ 0.2 శాతం మంది పురుషులు మాత్రమే కండోమ్ వాడుతున్నట్లు నివేదిక వెల్లడించింది. ఆ తర్వాత 0.5శాతంతో తెలంగాణ,0.8శాతంతో తమిళనాడు, 1శాతంతో బీహార్, 1.3 శాతంతో కర్నాటక రాష్ట్రాలు ఉన్నాయి.భారత పొరుగు దేశాల్లో పాకిస్తాన్ (9.9శాతం), మాల్దీవులు(11.7 శాతం) ఇరాన్ (13.7 శాతం) శ్రీలంక (6.1శాతం) చైనా (8.3శాతం) మంది పురుషులు కండోమ్ వినియోగిస్తున్నట్లు 2015 ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. ఇక ప్రపంచ దేశాలను చూస్తే కాంగో, బోట్స్‌వానా, హాంగ్‌కాంగ్, జపాన్, రష్యా, యూకే, అమెరికా దేశాల్లో కండోమ్ వినియోగించే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉందని నివేదిక స్పష్టం చేసింది.

 జనాభా నియంత్రించాలంటే కండోమ్ తప్పనిసరి

జనాభా నియంత్రించాలంటే కండోమ్ తప్పనిసరి

కండోమ్ వినియోగించకపోవడం ద్వారా రెండు సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ఒకటి అవగాహన లేని శృంగారంతో బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉంటే రెండోది సుఖవ్యాధులు వచ్చే ఛాన్స్ ఎక్కువగానే ఉంటుంది. ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్నాం కదా ఇక ఏముందిలే అని తేలిగ్గా తీసుకునే వారు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే అని ఆరోగ్యసంస్థ హెచ్చరిస్తోంది . గర్భం దాల్చకపోవచ్చుకానీ వ్యాధులు వచ్చే అవకాశం మాత్రం మెండుగా ఉంటుందని వార్నింగ్ ఇస్తోంది.

మొత్తానికి జనాభా నియంత్రించాలంటే అది పురుషుల్లోనే ఉందనేది స్పష్టమవుతోంది. శృంగార సమయంలో కండోమ్ వినియోగించడం జనాభా పెరుగుదలను కొంతవరకు నియంత్రించొచ్చని తద్వారా వచ్చే సమస్యలకు కూడా చెక్ పెట్టొచ్చని కొందరు ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

English summary
It's World Population Day and we have a problem. India's burgeoning population is a known problem but here we are talking about something which is less known but is as big a problem-Indian men don't like condoms.To be precise 94.4 per cent of them don't.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X