వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

''పంది... నీ దేశం వెళ్లిపో": భారత సంతతి సిఈఓ‌పై ట్రంప్ అనుచరులు

భారత సంతతికి చెందిన సిఈఓ రవీన్‌గాంధీపై ట్రంప్ అనుచరుల దూషణలుచార్లెసట్‌విల్లే ఘటనపై ట్రంప్ వైఖరిని తప్పుబట్టిన రవీన్‌గాంధీరవీన్‌ను ఇండియా వెళ్ళిపోవాలని ఆదేశాలు

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికాలో భారతీయ సంతతికి చెందిన రవీన్‌గాంధీకి ట్రంప్ మద్దతుదారుల నుండి వివక్షపూరితమైన వ్యాఖ్యలు ఎదురయ్యాయి.ట్రంప్ మద్దతుదారులు రవీన్‌గాంధీని దూషించారు. ట్వీట్లు, పోన్లు, ఈమెయిళ్ళ ద్వారా రవీన్‌పై జాతివివక్ష వ్యాఖ్యలు చేశారు.

అమెరికాలో జరిగిన చార్లెసట్‌విల్లే ఘ‌ట‌నపై ట్రంప్ వైఖ‌రిని వ్య‌తిరేకిస్తున్నానని జీఎంఎం నాన్‌స్టిక్ కోటింగ్స్ సంస్థ‌కు సీఈఓగా ఉన్న ర‌వీన్ గాంధీ సీఎన్‌బీసీలో ఓ వ్యాసం పోస్ట్ చేశారు.దీంతో ట్రంప్ మద్దతుదారులు రవీన్‌ను దూషించారు. ఈ-మెయిళ్లు, ట్వీట్లు, ఫోన్ కాల్స్ ద్వారా అత‌న్ని నానా మాట‌లు అన్నారు. .

Indian origin ceo racially abused by trump supporters in America

ట్రంప్ అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టి, ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ఎంత ముందుకు తీసుకెళ్లినా, చార్లెస‌ట్‌విల్లే ఘ‌ట‌న త‌ర్వాత ఆయ‌న‌పై న‌మ్మ‌కం పోయిందని గాంధీ తన వ్యాసంలో పేర్కొన్నారు.త‌న రంగులో లేని అమెరిక‌న్లపై జరుగుతున్న దౌర్జ‌న్యాలను ట్రంప్ చూసీచూడ‌న‌ట్లు వ‌దిలేయ‌డం స‌బ‌బు కాద‌ని రవీన్ ఏకీ పారేశారు.

ఈ కార‌ణంగా ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఆయ‌న విధానాల‌కు ఇక నుంచి మ‌ద్ద‌తు తెలిపేది లేదని గాంధీ తన వ్యాసంలో రాశారు.. దీంతో ఆయ‌న‌పై కొంత మంది ట్రంప్ మ‌ద్ద‌తుదార్లు దూష‌ణ‌ల ప‌ర్వం ప్రారంభించారు. ఈ నేప‌థ్యంలో త‌నను పంది...ప‌ర‌దేశీ అంటూ ఫోన్‌కాల్ ద్వారా ఓ యువ‌తి అన్న మాట‌ల‌ను గాంధీ యూట్యూబ్‌లో షేర్ చేశారు. త‌నను చాలా మంది చెప్పుకోలేని విధంగా దూషించార‌ని గాంధీ మీడియాకు తెలిపారు.

English summary
An Indian-origin CEO was racially abused and told to “go back to India” and also take along Nikki Haley after he said that he will not support President Donald Trump’s economic agenda after the US leader appeared to defend white supremacists following the Virginia violence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X