వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిగరేట్ గొడవ-జాతి విద్వేషం: అమెరికాలో సిక్కు వ్యక్తి దారుణ హత్య

అమెరికాలో భారత సంతతి దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. వారి కూతురు మాజీ ప్రియుడు మీర్జా టాట్లిక్‌(24) అనే వ్యక్తి ఆ దంపతులను శాన్‌జోసేలోని వారి ఇంట్లో దారుణంగా కాల్చి చంపేశాడు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: కాలిఫోర్నియాలో మొడెస్టో నగరంలోని ఓ కిరాణా దుకాణం బయట శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు భారత్‌కు చెందిన జగ్జీత్ సింగ్‌(32)ను పొడిచి చంపారు. దీనిని విద్వేష హత్యగా అనుమానిస్తున్నారు.

అమెరికా జాతీయుడిగా భావిస్తున్న ఓ వ్యక్తి దుకాణానికి వచ్చి అందులో పనిచేసే జగ్జీత్‌ను సిగరెట్‌ పెట్టె ఇవ్వాలని అడగ్గా, సరైన గుర్తింపు కార్డు చూపకపోవడంతో ఇచ్చేందుకు నిరాకరించారు. దాంతో అతను జాతిపరమైన దూషణలు చేస్తూ, జగ్జీత్‌ను హెచ్చరిస్తూ ఆగ్రహంతో వెళ్లిపోయారు.

ఈ మొత్తం ఘటన సీసీటీవీ కెమెరాల్లో నమోదైంది. కొద్దిసేపటికి జగ్జీత్‌ దుకాణం బయటికెళ్లగా, పదునైన కత్తితో దాడి జరిగింది. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మధ్యలోనే మరణించారు. ఆయన భార్య, పిల్లలు పంజాబ్‌లోని కపుర్తలాలో ఉంటున్నారు.

మరో ఘటనలో, కేరళకు చెందిన రమేశ్‌ అనే ఓ యువ వైద్యుణ్ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. మిచిగన్‌లోని ఓ ప్రధాన రహదారి పక్కన నిలిపిఉన్న కారులో ఆయన దేహాన్ని పోలీసులు గుర్తించారు.

కాగా, అమెరికాలో భారత సంతతి దంపతులు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. వారి కూతురు మాజీ ప్రియుడు మీర్జా టాట్లిక్‌(24) అనే వ్యక్తి ఆ దంపతులను శాన్‌జోసేలోని వారి ఇంట్లో దారుణంగా కాల్చి చంపేశాడు. అనంతరం పోలీసులతో జరిగిన ఘర్షణలో అతను మరణించాడు.

సిలికాన్‌వ్యాలీలో పని చేస్తున్న నరేన్ ప్రభు దంపతుల కుమార్తెతో మీర్జా టాట్లిక్‌ కొన్నాళ్లు ప్రేమాయణం నడిపాడు. గతేడాది వారిద్దరూ విడిపోయారు. ఈ నేపథ్యంలోనే మీర్జా టాట్లిక్‌ ఆమె తలిదండ్రులను పొట్టన బెట్టుకున్నాడు.

ఈ ఘటన జరిగినప్పుడు కూతురు ఇంట్లో లేదు. మీర్జా కాల్పులకు పాల్పడినపుడు తలిదండ్రులతో పాటూ పదమూడేళ్ల తమ్ముడు కూడా ఇంట్లోనే ఉన్నట్లు నరేన్ ప్రభు మరో తనయుడు పోలీసులకు చెప్పాడు. పోలీసులు వెంటనే రావడంతో 13 ఏళ్ల కుర్రాడిని మీర్జా వదిలేశాడు.

English summary
An Indian origin couple was killed in the Californian city San Jose in the US in an apparent revenge attack by their daughter's ex-boyfriend who too was eventually shot dead in a standoff with police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X