వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిక్కు ప్రశ్నతో బ్రిటన్ ప్రధానిని ఇబ్బంది పెట్టిన భారత బాలిక, మెచ్చుకోలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

లండన్: భారత సంతతికి చెందిన ఓ పాఠశాల విద్యార్థిని వేసిన ప్రశ్నకు బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్ ఒకింత తికమక పడ్డారు. ఏ రాజకీయ నాయకుడో లేదా ఏ జర్నలిస్టో అడిగిన ప్రశ్నలకే సాధారణంగా తడుముకోకుండా సమాధానం చెబుతుంటారు. అలాంటిది ఓ చిన్నారిని కామెరూన్ తికమక పెట్టారు. ఆ విద్యార్థిని పేరు రీమా. ఈ విద్యార్థిని నార్తర్న్ ఇంగ్లాండ్ సిటీకి చెందిన వారు.

బీబీసీ నిర్వహించిన పిల్లల కార్యక్రమంలో కేమరూన్‌కు ఈ ప్రశ్న ఎదురైంది. ఈ ఎన్నికల్లో మీరు తప్ప ఏ రాజకీయ నాయుకుడు గెలుస్తాడనుకుంటున్నారు? అందుకు కారణం ఏమిటి? అని రీమా ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు ఏం చెప్పాలో తెలియక 48 ఏళ్ల కేమరూన్ ఇరకాటంలో పడ్డారు. చివరికి సరైన సమాధానం చెప్పలేక డొంక తిరుగుడు ధోరణిలో ఆ విపత్కర పరిస్థితి నుంచి బయటపడ్డారు.

Indian-Origin Schoolgirl Stumps British PM With Her Question

తాను కాకుండా ఏ రాజకీయ నాయకుడు గెలుస్తాడని నేను ఎలా ఎంపిక చేస్తాను, ఈ ఎన్నికల్లో గెలవాలనే నేను పోటీ చేస్తున్నాను, అలాంటప్పుడు నేను కాకుండా మరో రాజకీయ నాయకుడు గెలుస్తాడని ఊహించలేను, రంగంలో ఎందరో అభ్యర్థులున్నా విజయం నాదేనని భావిస్తున్నానని కేమరూన్ అన్నారు.

అంతేకాదు, ఈ ఎన్నికల్లో తాను గెలవలేనని భావిస్తే, మరొకరే గెలుస్తారని అనుకుంటే తాను పోటీలోనే ఉండేవాడ్ని కాదని చెప్పారు. కచ్చితంగా తానే గెలుస్తానని చెప్పారు. అంతేకాదు, ఇది చిన్న ప్రశ్నే అయినప్పటికీ ఇంతటి సంక్లిష్టమైన ప్రశ్న తనను ఎవరూ అడగలేదని కామెరూన్ అన్నారు. ఇదే అత్యుత్తమ ప్రశ్న అని కితాబిచ్చారు.

English summary
It was not any of the hard-nosed journalists or politicians but a 10-year-old Indian-origin schoolgirl that has stumped the British Prime Minister David Cameron on the campaign trail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X