వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2కోట్ల ఇల్లును.. రూ.168కే అమ్మేసింది: అసలు లాజిక్ ఏంటంటే!?

ఎందుకిలా చేసిందంటే?.. లండన్‌లో ఇంటి యజమాని కన్నా.. అద్దెకు ఉంటున్నవారికే ఎక్కువ అధికారాలు ఉంటాయని రేఖ చెబుతున్నారు.

|
Google Oneindia TeluguNews

లండన్: కోర్టు చిక్కుల నుంచి తప్పించుకునేందుకు.. చట్టాలను ఉపయోగించుకుని భలే తెలివైన ఐడియా వేసింది లండన్ నివాసి అయిన రేఖ అనే భారతీయ మహిళ. ఇష్టపడి కొనుక్కున్న ఇల్లును పక్కింటివారికి నష్ట పరిహారం కింద అమ్మేయాల్సి రావడంతో.. అత్యంత చౌక ధరకు ఇంటిని అమ్మేసింది.

ఎందుకిలా చేసిందంటే?.. లండన్‌లో ఇంటి యజమాని కన్నా.. అద్దెకు ఉంటున్నవారికే ఎక్కువ అధికారాలు ఉంటాయని రేఖ చెబుతున్నారు. కేవలం రెండు పౌండ్లకే(రూ.168) తన ఇంటిని రెండు కంపెనీలకు అమ్మేసింది రేఖ. అదే కంపెనీలతో 'అద్దె' ఒప్పందం కూడా కుదుర్చుకుంది. దీని ప్రకారం పదేళ్లపాటు 50పౌండ్లు చెల్లించి రేఖ అదే ఇంట్లో ఉండనుంది.

Indian origin woman sells home for 2 pounds

ఇంతకీ కోర్టులు చిక్కులు ఎందుకంటే?:

బ్రిటన్ లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోన్న రేఖ(43) పదేళ్ల క్రితం రూ.2కోట్ల పైచిలుకు ఖర్చుతో సీమండ్లీ అనే గ్రామంలో ఇల్లును కొనుక్కుంది. ఇల్లు కొనుగోలు తర్వాత కొన్ని మరమ్మత్తులు చేస్తుంటే.. పక్కింటికి కొంత డ్యామేజీ జరిగింది.

ఆ ఇంటి గోపురం దెబ్బతినడంతో.. దాని యజమానురాలు కోర్టుకెక్కింది. దీంతో ఆరేళ్ల నుంచి కోర్టు కేసులు కొనసాగుతూనే వస్తున్నాయి. నష్టపరిహారం కింద సగం మొత్తం చెల్లించిన రేఖ.. మిగతా మొత్తాన్ని చెల్లించలేకపోయింది.

దీంతో ఇంటిని అమ్మేసి 76వేల పౌండ్ల నష్టపరిహారాన్ని చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో గొడవ మొదటికొచ్చినట్టయింది. కోర్టు ఆదేశాలను చట్టాల సహాయంతో తప్పించుకోగలిగింది. చట్టప్రకారం తన ఇంటిని స్వాధీనం చేసుకునే అవకాశం లేకుండా రేఖ తన ఇంటిని రెండు కంపెనీలకు అమ్మేసింది.

భారతీయ కరెన్సీ ప్రకారం కేవలం రూ.168కే అమ్మేసింది. మార్కెట్ వాల్యూ ప్రకారం ఆ ఇంటి విలువ 2లక్షల 50వేల పౌండ్లు. కానీ అద్దెదారులకే ఇంటిపై ఎక్కువ అధికారాలు ఉంటాయన్న పాయింట్ ను బేస్ చేసుకుని.. రేఖ ఇంటిని అమ్మేసింది. ఆ తర్వాత అదే ఇంట్లో అద్దె చెల్లించి ఉంటోంది.

దీంతో కోర్టు ఆదేశాల నుంచి రేఖ తప్పించుకున్నట్టయింది. కాగా, తన ఇంటిని కాపాడుకునేందుకు ఇంతకంటే మరో మార్గమేది కనిపించలేదన్నారు రేఖ. న్యాయవ్యవస్థ అందరికీ సమన్యాయం చేయాలని కోరుతున్నారు. త్వరలోనే ఇండియా వచ్చి దీనిపై ఓ పుస్తకం కూడా రాయబోతున్నట్టు రేఖ తెలిపారు.

English summary
A 43-year-old Indian-origin teacher in the UK has sold her home, which has a market value of 250,000 pounds, for a token of mere 2 pounds to ensure that she cannot be evicted from the property.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X