వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అస్ట్రేలియాలో క్రైస్తవ మతబోధకుడిపై దాడి

అమెరికాలో భారతీయులపై కొనసాగుతున్న దాడులు అస్ట్రేలియాకు వ్యాపించాయి. అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత దాడులు పెరిగాయనే ఆందోళన భారతీయుల్లో కొనసాగుతోంది.ఈ తరుణంలోనే అస్ట్రేలియాలో క

By Narsimha
|
Google Oneindia TeluguNews

మెల్ బోర్న్: అమెరికాలో భారతీయులపై కొనసాగుతున్న దాడులు అస్ట్రేలియాకు వ్యాపించాయి. అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత దాడులు పెరిగాయనే ఆందోళన భారతీయుల్లో కొనసాగుతోంది.ఈ తరుణంలోనే అస్ట్రేలియాలో కూడ ఇండియాకు చెందిన వారిపై దాడులు జరగడం ఆందోళన కల్గిస్తోంది.

మెల్ బోర్న్ లోని ఓ చర్చిలో భారత సంతతికి చెందిన క్రైస్తవ మత గురువుపై దాడి చేసి గొంతులో పొడిచాడు. కేరళలోని కోజికోడ్ జిల్లాకు చెందిన టామీ కలథూర్ మాథ్యూ మెల్ బోర్న్ శివారు ఫాకనర్ ప్రాంతంలో సెయింట్ మాత్యూన్ చర్చిలో ఆదివారం నాడు ప్రార్థనలు చేయిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకొంది.

 indian priest stabbed in australia

చర్చిలో ప్రార్థన చేయడానికి వచ్చిన వారి ముందే దుండగుడు ఈ దాడికి పాల్పడ్డాడు.నువ్వు భారతీయుడివి. హిందువు లేదా ముస్లింవి. నువ్వు ప్రార్థన చేయడానికి వీల్లేదు. నిన్ను చంపేస్తా అంటూ అరుస్తూ దుండగులు కత్తితో మాత్యూ దగ్గరికి వచ్చి పొడిచాడు.

కొంతమంది అతడిని పట్టుకొనే ప్రయత్నం చేసినప్పటికి ఆయన తప్పించుకొన్నాడు. మాథ్యూ ఆసుపత్రిలో చికిత్సతీసుకొని డిశ్చార్జ్ అయ్యారు.

ప్రార్థన సమయంలో ప్రత్యేక దుస్తులు ధరించినందున మెడ చుట్టూ మందంగా ఉండే వస్త్రం ఉండడంతో కత్తి లోపలికి దిగలేదని వైద్యులు చెప్పారు. పోలీసులు 72 ఏళ్ళ దుండగుడిని ఆదివాం రాత్రి అరెస్టు చేశారు. నిందితుడు ఇటాలియన్ సంతతికి చెందినవాడుగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

English summary
a Catholic parish priest was stabbed at his church in Melbourne’s north yesterday morning as he was preparing to deliver Sunday mass by a man who allegedly said the priest should not be permitted to do so because he was indian.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X