వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆస్ట్రేలియాలో ఉరేసుకుని భారత విద్యార్థి మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Indian student dies in Australian immigration detention centre
మెల్బోర్న్: అస్ట్రేలియాలోని ఇమిగ్రేషన్ డిటెన్షన్ సెంటర్‌లో 27 ఏళ్ల భారత విద్యార్థి మరణించాడు. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా ఇక్కడే ఉన్నందుకు అతన్ని మెల్బోర్న్‌లోని ఇమిగ్రేషన్ డిటెన్షన్ సెంటర్‌లో ఉంచారు. అతను ఉరేసుకుని మరణించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

మేరీబేర్నాంగ్ ఇమిగ్రేషన్ డిటెన్షన్ సెంటర్‌లోని సెల్‌లో గత విద్యార్థి ఉరేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయంటూ ఫెయిర్‌ఫాక్స్ మీడియా ఓ వార్తాకథనాన్ని ఇచ్చింది. సెంటర్‌లో ఆ వ్యక్తి స్పృహ కోల్పోయి పడి ఉండడాన్ని సిబ్బంది గుర్తించారని ఇమిగ్రేషన్ మంత్రి స్కాట్ మారిషన్ అంటున్నారు.

అతని మృతికి సంబంధించి ఏ విధమైన అనుమానాలు లేవని మారిసన్ అన్నారు. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా ఇక్కడే ఉండడంతో అతన్ని జనవరిలో నిర్బంధంలోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

మృతుడి కుటుంబ సభ్యులకు, మిత్రులకు ప్రొవిన్షియల్ ప్రభుత్వం సానుభూతి తెలిపింది. దర్యాప్తునకు పోలీసులకు, ఇతర అధికారులకు తాము సహకరిస్తామని ప్రకటించింది.

English summary
A 27-year-old Indian student, who had overstayed his visa in Australia, died at an immigration detention centre in Melbourne allegedly by hanging himself.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X