వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాలిఫోర్నియాలో కాల్పులు ఇండియన్ స్టూడెంట్ ధరమ్ ప్రీత్ మృతి

By Narsimha
|
Google Oneindia TeluguNews

కాలిఫోర్నియా: అమెరికాలో జరిగిన కాల్పుల ఘటనలో ఇండియాకు చెందిన ప్రవాస భారత విద్యార్థి ధరమ్ ప్రీత్ జస్సేర్ మరణించారు. ధరమ్ ప్రీత్ జస్సేర్ విధులు నిర్వహిస్తున్న దుకాణం పక్కనే ఉణ్న గ్యాస్ స్టేషన్‌ వద్ద నలుగురు దుండగులు దోచుకొనేందుకు వచ్చారు. అయితే దుండగులను చూసిన ధరమ్ ప్రీత్ జస్సేర్‌పై కాల్పులు జరిపారు. దీంతో ధరమ్ అక్కడికక్కడే చనిపోయారు.

Indian student shot dead at grocery store in U.S.
తుపాకీ సంస్కృతికి భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ఘటన కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. కాలిఫోర్నియాలోని ఫ్రెస్నో నగరంలోని ఒక దుకాణంలో ప్రవాస భారతీయ విద్యార్థి ధరమ్ ప్రీత్ జస్సేర్ (21) విధులు నిర్వర్తిస్తున్నాడు

. ఆయన పని చేసే దుకాణం పక్కనున్న గ్యాస్‌ స్టేషన్‌ ను దోచుకునేందుకు నలుగురు దుండగులు వచ్చారు. వారిని చూసిన ధరమ్‌ ప్రీత్‌ జస్సేర్ తన దుకాణంలోని క్యాష్‌ కౌంటర్‌ వద్ద దాక్కున్నాడు. అతనిని గుర్తించిన దుండగుడు తుపాకీతో కాల్చగా ప్రాణం కోల్పోయాడు. మరుసటి రోజు సరకులు కొనుగోలు చేసేందుకు వచ్చిన వ్యక్తి పోలీసులకు సమాచారం అందించడంతో దారుణం వెలుగులోకి వచ్చింది.

గ్యాస్ స్టేషన్ లో రికార్డైన సీసీ పుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నలుగురు అనుమానితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అతను భారతసంతతికి చెందిన అత్వాల్ (22) కావడం విశేషం. పంజాబ్ రాష్ట్రానికి చెందిన ధరమ్ ప్రీత్ జస్సేర్ మూడేళ్ల క్రితం చదువుకునేందుకు విద్యార్థి వీసాపై అమెరికా వెళ్లారు.

English summary
A 21-year-old Indian student has been shot dead allegedly by four armed robbers, including an Indian-origin man, at a grocery store in California, according to a media report.Dharampreet Singh Jasser was on duty at a grocery store next to a gas station in Fresno city in California on Tuesday night when four armed robbers, including an Indian-origin man, barged in to loot the store, local daily Fresnobee reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X