వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో విద్యార్థుల అరెస్ట్: సాయం చేసేందుకు ముందుకొచ్చిన తెలుగు సంఘాలు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఫేక్ సర్టిఫికేట్లతో అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారనే కారణంతో డెట్రాయిట్ పోలీసులు వందలాది మంది తెలుగు విద్యార్థులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరికి సహాయం చేసేందుకు ఆటా (అమెరికా తెలుగు అసోసియేషన్), నాట్స్ (నార్త్ అమెరికా తెలుగు సంఘం) ముందుకు వచ్చింది. ఈ మేరకు ఇవి ప్రకటన చేశాయి.

అరెస్ట్ అయిన తెలుగు విద్యార్థులకు న్యాయ సాయం చేసేందుకు నాట్స్ ముందుకు వచ్చింది. నాట్స్ చైర్మన్, అధ్యక్షులు కలిసి అరెస్టుకు సంబంధించి న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు.

Indian students arrest: ATA and NATS ready to help

మరోవైపు, అరెస్టైన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆటా పేర్కొంది. భారత్ నుంచి ఎంతోమంది అమెరికా వస్తుంటారని, చట్టం ప్రకారం అంతా సక్రమంగానే జరుగుతుందని చెప్పారు. అమెరికా రావాలనుకునే వారు ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పారు.

కాగా, అమెరికాలో అక్రమ వలసదారుల్ని గుర్తించటంలో భాగంగా సెక్యూరిటీ అధికారులు ఇమ్మిగ్రేషన్‌ అక్రమాలు చేస్తున్న వాళ్లపై స్టింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో వందలాది మంది ఫేక్ సర్టిఫికేట్లతో ఉంటున్నట్లుగా గుర్తించారు.

దాదాపు ఆరు వందల మంది విదేశీ విద్యార్థులకు నకిలీ పత్రాలు ఇచ్చేందుకు సహకరించిన పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. వీసా కాలపరిమితి ముగిసినప్పటికీ అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వారిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఎక్కువగా తెలుగు వారు ఉన్నారు.

English summary
United States Citizenship and Immigration Services (USCIS) and Immigration and Customs Enforcement (ICE) have conducted raids and detained Indian students in various cities of the United States of America on Wednesday. This news was brought to the attention of the ATA and NATS by the affected students and their friends.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X