వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇమిగ్రేషన్ అధికారులు: భారతీయ విద్యార్థులకు వేదింపులు

|
Google Oneindia TeluguNews

మెల్ బోర్న్: "మేము ఇమిగ్రేషన్ అధికారులు, మీ వీసా ప్రాసెసింగ్ లో సమస్యలు ఉన్నాయి, మీ ధ్రువీకరణ పత్రాలలో చాల పోరపాట్లు ఉన్నాయి, ఏమి చేస్తారు, నగదు ఇస్తే అన్ని సరి చేస్తాం లేదంటే మీకు లేని పోని సమస్యలు వస్తాయి. ఇప్పటికే చాల ఆలస్యం అయ్యింది. ఆలోచించి త్వరగా మీ నిర్ణయం చెప్పండి".

అవీ న్యూజిలాండ్ లో భారతీయ విద్యార్థులు ఎదుర్కోంటున్న సమస్యలు. నకిలి ఇమిగ్రేషన్ అధికారుల ఆగడాలతో భారతీయ విద్యార్థులు నిలువు దోపిడికి గురి అవుతున్నారు. స్థానిక మీడియా స్వయంగా ఈ కథనాన్నిఇటివల వెలుగులోకి తీసుకు వచ్చింది.

న్యూజిలాండ్ లో విద్యాభ్యాసం చేస్తున్న భారతీయ విద్యార్థుల ఫోన్ నెంబర్లు సేకరించిన కొందరు నిందితులు నకిలి ఇమిగ్రేషన్ అధికారుల అవతారం ఎత్తుతున్నారు. మీ వీసా ప్రాసెసింగ్ లో సమస్యలు ఉన్నాయని, అరైవల్ కార్డులో సరైన సమాచారం లేదని బెదిరిస్తున్నారు.

 Indian students receiving fake phone calls in New Zealand

తరువాత భారత్ లోని వెస్ట్రన్ యూనియన్ అకౌంట్ లో నగదు జమ చేస్తే అన్నీ సరిచేస్తామని బెదిరిస్తున్నారు. ఎక్కడ లేని పోని సమస్యలు వచ్చి చదువు మధ్యలో ఆగిపోతుందని భయపడుతున్న విద్యార్థులు నిందితులు చెప్పినట్లు నడుచుకుని జేబులు ఖాళీ చేసుకుంటున్నారు.

ఇటివల ఒక యువతి ఏకంగా రూ. 2.50 లక్షలు నిందితుల అకౌంట్ లో జమచేసి బాధపడుతున్నది. నిందితులు ఇమిగ్రేషన్ అధికారుల ఫోన్ నెంబర్లకు దరిదాపు దగ్గరగా ఒక నెంబర్ తేడా ఉన్న నెంబర్ల నుండి ఫోన్ లు చేసి బెదిరిస్తున్నారు. ఇమిగ్రేషన్ అధికారులు నదు ఇవ్వాలని ఎవ్వరిని బెదిరించరని, భారతీయ విద్యార్థులు జాగ్రతగా ఉండాలని న్యూజిలాండ్ అధికారులు సూచించింది.

English summary
The callers claim to be calling from Immigration New Zealand and tell the person there has been a problem with the processing of their visa or arrival card information.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X