వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా కాల్పుల్లో భారతీయ మహిళ మృతి, రాబరీ కోసమా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఓ యువతి అమెరికాలోని సౌత్ కరోలినా జరిగిన కాల్పుల్లో మృతి చెందింది. ఈ సంఘటన రెండు రోజుల క్రితం జరిగింది. ఆమె దక్షిణ కరోలినాలో ఒక వాయు ఇంధన కేంద్రం సహయజమానురాలు. ఆమె పేరు మృదులా బెన్ పటేల్.

సాయుధులైన దోపిడీదారులు కాల్పులు జరపడంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు. గురువారం నాడు రాత్రి కాల్పులు జరిగిన వెంటనే వైద్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అత్యవసర శస్త్ర చికిత్స నిర్వహించారు. పరిస్థితి విషమించి, శనివారం ఆమె ప్రాణాలు కోల్పోయారు.

Indian woman shot dead by an unidentified gunman in South Carolina

మృదులా బెన్ పటేల్ పైన కాల్పులకు కారణాలు తెలియరాలేదని, ఆమె స్నేహితుడు దిలీప్ షా అన్నారు. సీసీటీవీ ఫుటేజీ దృశ్యాల ఆధారంగా నిందితుల ఆచూకీ తెలుసుకునేందురు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

మృదులా బెన్ పటేల్‌కు అమెరికా, బ్రిటిష్ సిటిజన్ షిప్ ఉంది. కాగా, ఆమె పైన రాబరీ కోసం దాడి జరిగి ఉండవచ్చునని, ఇది జాత్యాంహంకార దాడి కాకపోయి ఉంటుందని చెబుతున్నారు. అట్లాంటాలోని భారత్ కాన్సులేట్ అధికారులు ఆమె భర్తతో మాట్లాడారు.

English summary
An Indian-origin Gujarati woman working at a gas station in the US state of South Carolina was shot in the face in an attempted armed robbery and succumbed to her injuries on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X