వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నల్లకుబేరుల జాబితాలో ఇద్దరు భారతీయ మహిళలు

|
Google Oneindia TeluguNews

బెర్న్: విదేశాలలో బ్లాక్ మని దాచుకున్నఇద్దరు భారత మహిళల పేర్లు బయటకు వచ్చాయి. ఆ ఇద్దరు మహిళలు ఎవరనేది పెద్ద చర్చకు దారి తీసింది. అయితే ఆ మహిళల పేర్లు, పుట్టిన తేది వివరాలు మాత్రం బయటకు వచ్చాయి. పూర్తి వివరాలు బయటకురావడానికి సమయం పడుతుందని అధికారులు అంటున్నారు.

సంగీత సాహ్ని, స్నేహలత సాహ్ని అనే ఇద్దరు మహిళలకు స్విస్ బ్యాంక్ లో అకౌంట్లున్నాయని స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ టీఏ) వెల్లడించింది. ఇద్దరు మహిళల పేర్లు, వారు పుట్టిన తేదీలు మాత్రం వెల్లడిస్తున్నామని, పూర్తి వివరాలు వెల్లడించడానికి ఒక నెల సమయం పడుతుందని అధికారులు అన్నారు.

Indian womens figure among scores of foreign nationals with Swiss bank accounts,

ఆ ఇద్దరు మహిళలు వారి పూర్తి వివరాలు బయటకురాకుండా ఉండాలంటే 30 రోజుల లోపు వారిద్దరు ఫెడరల్ అడ్మినిస్ట్రేషన్ కోర్టులో అప్పీలు చేసుకోవచ్చని ఎఫ్ టీఏ తెలిపింది. భారతీయ మహిళలతో పాటు రష్యా, స్పెయిన్, బ్రిటిష్ దేశాలకు చెందిన నల్లకుబేరుల పేర్లను ఎఫ్ టీఏ వెల్లడించింది.

అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు చెందిన నల్లకుబేరుల ఇనిషియల్స్ మాత్రం వెల్లడించారు. మొత్తం 40 మంది నల్లకుబేరుల వివరాలను స్విస్ పెడరల్ గెజిట్ లో ప్రచురించారు. అయితే వారి పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు. రానున్న రోజులలో నల్లకుబేరుల అందరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది.

English summary
At least 40 such ‘final notices’ have been published in the Swiss Federal Gazette so far this month, while more such names are expected to be published going forward.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X