వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: గ్రీన్‌కార్డు కోసం 12 ఏళ్ళు వేచిచూడాల్సిందే

అమెరికాలో స్థిరపడాలనుకొనే భారతీయులు గ్రీన్‌కార్డ్ కోసం కళ్ళుకాయలు కాసేలా ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికాలో స్థిరపడాలనుకొనే భారతీయులు గ్రీన్‌కార్డ్ కోసం కళ్ళుకాయలు కాసేలా ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.

గ్రీన్‌కార్డ్‌ను ధరఖాస్తు చేసుకొన్న భారతీయులు దాదాపు 12 ఏళ్ళపాటు ఎదురుచూడాల్సిన పరిస్థితులు ఉంటాయని రిపోర్టులు తెలుపుతున్నాయి.

ప్రతి ఏటా గ్రీన్‌కార్డులను పొందుతున్న టాప్ దేశాల్లో భారత్ ఒకటిగా ఉంది. 2015 లో 36,318 మంది భారతీయులు తమ స్టేటస్‌ను శాశ్వత పౌరసత్వంగా మార్చుకోగా, 27,289 మంది భారతీయులు గ్రీన్‌కార్డు రూపంలో చట్టబద్దత శాశ్వత పౌరసత్వం పొందినట్టు ఫ్యూ రీసెర్చ్ తెలిపింది.

Indians applying for Green Card has 12-years waiting list: report

ఎంప్లాయి‌మెంట్‌కు సంబంధించిన కేటగిరిలో శాశ్వత పౌరసత్వం కోసం ధరఖాస్తు చేసుకొనే భారతీయులు వారు నిపుణవంతులైన ఉద్యోగులైనప్పటికీ ప్రస్తుతం 12 ఏళ్ళు వెయిటింగ్‌‌లిస్టులో ఉన్నారు.

2005 మేలో ధరఖాస్తు చేసుకొన్న వారి అప్లికేషన్ల ప్రక్రియను ప్రభుత్వం ఇప్పుడు చేపడుతోందని రిపోర్ట్ తెలిపింది.ఫ్యూ డేటా ప్రకారంగా 2010 నుండి 2014 వరకు ఎంప్లాయి‌మెంట్‌కు చెందిన గ్రీన్‌కార్డులు 36 శాతం అంటే 2,22,000 పైగా హెచ్-1బీ వీసా హెల్డర్స్‌కే అందించినట్టు తెలిసింది.

అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉండడానికి పనిచేయడానికి గ్రీన్‌కార్డు ఎంతో అవసరం.గ్రీన్‌కార్డు హోల్డర్లు ఐదేళ్ళ నివాసం తర్వాత అమెరికా సిటిజన్‌షిఫ్ కూడ ధరఖాస్తు చేసుకోవచ్చు.

English summary
There is a lengthy 12-year waiting period for Indians applying for permanent residency also known as Green Card in the US as skilled employees, according to a new report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X