వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండోనేసియా భూకంపం: 42కు పెరిగిన మృతులు -వందల ఇళ్లు ధ్వంసం -చీకట్లో సులవేసి దీవి

|
Google Oneindia TeluguNews

ఆగ్నేయాసియాలో అత్యధిక జనాభా కలిగిన ఇండోనేసియా దేశంలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. సులవేసి దీవిలో చోటుచేసుకున్న ఈ విపత్తులో మృతుల సంఖ్య 42కు పెరిగింది. భూకంపం ధాటికి పెద్ద సంఖ్యలో ఇళ్లు నేలమట్టమై.. వందలాది మంది గాయపడ్డారు. భవన శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. వివరాల్లోకి వెళితే..

Recommended Video

#indonesia ఇండోనేసియాలో భూకంపం..దృశ్యాలు

బీజేపీకి పవన్ షాకిస్తారా? సరెండరా? తిరుపతి ఉప ఎన్నికపై 21న కీలక నిర్ణయం -వకీల్ సాబ్ దూకుడు చూస్తేబీజేపీకి పవన్ షాకిస్తారా? సరెండరా? తిరుపతి ఉప ఎన్నికపై 21న కీలక నిర్ణయం -వకీల్ సాబ్ దూకుడు చూస్తే

ప్రపంచంలోనే అతి పెద్ద దీవుల్లో ఒకటిగా, ఇండోనేసియాలో అంతర్బాగంగా ఉన్న సులవేసి దీవిలో.. స్థానిక కాలమానం ప్రకారం.. అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత భూకంపం సంభవించింది. 6.2 తీవ్రతతో దాదాపు 7 సెకన్ల పాటు భూమి కంపించింది. భూకంపం ధాటికి 62 భవనాలు కుప్పకూలినట్లు ఇండోనేసియా డిజాస్టర్‌ మిటిగేషన్ ఏజెన్సీ వెల్లడించింది. ప్రజలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో భూకంపం సంభవించడంతో చాలా మంది శిథిలాల కిందే చిక్కుకుపోయారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

 Indonesia earthquake: death toll climbs to 42, injured hundreds, What we know so far

ఇండోనేసియా భూకంపం ధాటికి ఇప్పటివరకు 42 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఏజెన్సీ చీఫ్‌ డార్నో మజీద్‌ తెలిపారు. భవనాలు నేలమట్టమవడంతో చాలా మంది చిక్కుకుపోయారని, దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు చెప్పారు. డిజాస్టర్‌ ఏజెన్సీ సమాచారం ప్రకారం.. మజెని ప్రాంతంలో 637 మంది, మముజు ప్రాంతంలో 20 మందికి పైగా గాయపడ్డారు. ప్రకంపనల కారణంగా విద్యుత్ స్తంభాలు దెబ్బతినడంతో సులవేసి దీవిలోని చాలా ప్రాంతాలు ఇంకా చీకట్లోనే ఉండిపోయాయి. కాగా..

 Indonesia earthquake: death toll climbs to 42, injured hundreds, What we know so far

మోదీ సాబ్.. మా బాకీ ఇప్పించండి -ఇబ్బందుల్లో ఉన్నాం -కేంద్రానికి హైదరాబాద్ నిజాం మ‌న‌వ‌డి విజ్ఞప్తిమోదీ సాబ్.. మా బాకీ ఇప్పించండి -ఇబ్బందుల్లో ఉన్నాం -కేంద్రానికి హైదరాబాద్ నిజాం మ‌న‌వ‌డి విజ్ఞప్తి

గురువారం కూడా ఇదే ప్రాంతంలో 5.9 తీవ్రతతో భూమి కంపించింది. ఇక్కడ గడిచిన 24 గంటల్లో 26 సార్లు భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో మూడు చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో పలు ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. 'రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌' ఇండోనేసియాలో భూకంపాలు తరచుగా సంభవిస్తుంటాయి. 2018లో ఇదే సులవేసి దీవిలో 6.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించి సునామీ వచ్చింది. ఆ ప్రకృతి విపత్తులో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.

 Indonesia earthquake: death toll climbs to 42, injured hundreds, What we know so far
English summary
A strong, shallow earthquake shook Indonesia's Sulawesi island just after midnight Friday, toppling homes and buildings, triggering landslides and killing at least 42 people. More than 600 people were injured by the magnitude 6.2 quake, which sent people fleeing their homes in the darkness.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X