వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుళ్లు: 47మంది సజీవ దహనం

ఇండోనేషియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బాణాసంచా కర్మాగారంలో పేలుడు సంభవించడంతో 47మంది సజీవ దహనమయ్యారు. గురువారం ఉదయం 9 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది.

|
Google Oneindia TeluguNews

జకార్తా: ఇండోనేషియాలో గురువారం ఉదయం 9గంటల ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బాణాసంచా కర్మాగారంలో పేలుడు సంభవించడంతో 47మంది సజీవ దహనమయ్యారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జకార్తా సమీపంలోని తంగెరాంగ్‌ ప్రాంతంలో గల ఓ బాణసంచా ఫ్యాక్టరీలో గురువారం ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి భవనమంతా వ్యాపించాయి. ఈ ఘటనలో 47 మంది సజీవ దహనమయ్యారు. పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు.

Indonesia fireworks factory explosions kill at least 47 people

సమాచారమందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ఘటన సమయంలో ఫ్యాక్టరీలో 103 మంది సిబ్బంది పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మృతదేహాలు గుర్తుపట్టడానికి వీల్లేకుండా పూర్తిగా కాలిపోయినట్లు చెప్పారు.

గాయపడ్డ 43మందిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. కాగా, మంటల ధాటికి భవనం చాలా వరకూ కుప్పకూలింది. పక్కనే ఉన్న కార్లు కూడా దగ్ధమయ్యాయి. ఫైరింజన్లు మంటలను పూర్తిగా ఆర్పీవేశాయి.

English summary
Two explosions and a subsequent blaze at a fireworks factory on the western outskirts of Indonesia’s capital have killed at least 47 people and injured dozens more, officials have said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X