వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచ బ్యాంకు అధ్యక్ష రేసులో ఇంద్రా నూయి...!

|
Google Oneindia TeluguNews

వాషింగ్ట‌న్ : భారత సంతతికి చెందిన ఇంద్రా నూయి ప్రపంచ బ్యాంకు అధ్యక్ష రేసులో ఉన్నారు. ఈ పదవి కోసం ఆమె పేరు ఇటీవల ప్రస్తావనకు వచ్చింది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూతురు ఇవాంకా ఆమె పేరును ప్రతిపాదించినట్లు సమాచారం. ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్ పదవి కోసం అమెరికా నుంచి కొన్ని పేర్లు ప్రతిపాదనకు వెళ్లే క్రమంలో.. ఇంద్రా నూయి పేరు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ పదవి కోసం తొలుత చాలా పేర్లు బయటకు వచ్చాయి. ఒకానొక సందర్భంలో ట్రంప్ కూతురు ఇవాంకా పేరు కూడా వినిపించింది. అయితే భారత సంతతికి చెందిన ఇంద్రా నూయి పేరును ఇవాంకా ప్రతిపాదించడం ప్రాధాన్యత సంతరించుకుంది. వైట్‌హౌజ్ కూడా ఆమె వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ప్రముఖ కూల్ డ్రింక్ కంపెనీ పెప్సీకి సీఈవోగా సేవలందించిన ఇంద్రా నూయి గతేడాది బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

indra nooyi is in the world bank president race

వరల్డ్ బ్యాంకు అధ్యక్షుడిగా ఉన్న జిమ్ యాంగ్ కిమ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో ఆ పదవి ఎవరికి దక్కుతుందోననే ఉత్కంఠ మొదలైంది. ఇంకా మూడేళ్ల సర్వీస్ ఉన్నప్పటికీ ఆయన రాజీనామా ప్రకటించడంతో ఆ పదవి రేసులో కొందరి పేర్లు వినిపిస్తున్నాయి. అమెరికా ప్రతిపాదించిన వ్యక్తులే ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవి చేపడుతుండటంతో.. ఇంద్రా నూయి పేరును వైట్‌హౌజ్ వర్గాలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో నామినేషన్ల స్వీకరణ పూర్తికానుంది. అనంతరం ఏప్రిల్ నెలలో కొత్త ప్రెసిడెంట్ ను ప్రకటించనున్నారు.

English summary
Indian-origin Indra Nooyi is in the race for president. Her name was recently referenced for this post. American President Trump's daughter Ivanca also referred her name.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X