• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సుశాంత్ స్ఫూర్తి: భార్యకు వెడ్డింగ్ గిఫ్ట్ - రూ.3వేలకే చంద్రుడిపై స్థలం కొన్న పాకిస్తానీ యువకుడు

|

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి దారి తీసిన కారణాలు, వాటిపై కొనసాగుతోన్న రాజకీయ దుమారాన్ని పక్కనపెడితే.. నటనతోనే కాకుండా.. వ్యక్తిత్వం, అభిరుచుల పరంగానూ అతని నుంచి స్ఫూర్తి పొందినవాళ్లు, పొందుతున్నవాళ్ల జాబితా పెద్దదే. చిన్నప్పటి నుంచీ అంత‌రిక్ష విశేషాలు తెలుసుకోవ‌డం తను ఇష్టమని, సుశాంత్ చాలా సార్లు చెప్పాడు. అతని సోషల్ మీడియా అకౌంట్లలోనూ స్పేస్ కు సంబంధించిన విషయాల్నే ఎక్కువగా పోస్ట్ చేసేవాడు. చంద్రుడిపై స్థ‌లం కొన్న ఏకైక భారతీయ నటుడు కూడా అతనే. సుశాంత్ స్ఫూర్తితో తర్వాతి కాలంలో కొందరు చంద్రుడిపై స్థలాలు కొన్నారు. ఇప్పటి వంతు ఓ పాకిస్తాన్ యువకుడిది..

జగన్ మౌనం బద్దలైతే ఊడేదేంటి? - అమిత్ షాతో ఆ విషయమా? స్వరూపానంద మౌనమేల?: ఎంపీ రఘురామ

 భార్యకు వెడ్డింగ్ గిఫ్ట్..

భార్యకు వెడ్డింగ్ గిఫ్ట్..

పాకిస్తాన్ లోని రావల్పిండికి చెందిన సోహైబ్ అహ్మద్ అనే యువకుడు తమ పెళ్లి రోజు కానుకగా భార్య మదీహాకు అరుదైన గిఫ్ట్ ఇచ్చాడు. ఆమె పేరిట జాబిలమ్మపై స్థలం కొని, రిజిస్ట్రేషన్ పేపర్లను చేతిలో పెట్టాడు. ‘‘నా భర్త ఇచ్చిన గిఫ్ట్ గురించి ఫ్రెండ్స్ కు చెబితే అస్సలు నమ్మలేదు. డాక్యూమెంట్లు చూశాకగానీ వాపోలేదు'' అని మదీహా మీడియాతో చెప్పింది. ఈ ముచ్చట టీవీల్లో ప్రసారమైన తర్వాత సోహైబ్ దంపతులు సెలబ్రిటీలుగా మారిపోయారు. ప్రతి ఇంటర్వ్యూలోనూ సోహైబ్.. ‘‘బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ స్ఫూర్తితోనే నేను చంద్రుడిపై స్థలం కొన్నాను'' అని చెప్పుకొచ్చాడు.

 రూ.3300కే ప్లాట్ సొంతం..

రూ.3300కే ప్లాట్ సొంతం..

‘లూనార్ సొసైటీ ఇంటర్నేషనల్' అనే సంస్థ చాలా కాలంగా చంద్రుడిపై రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నది. దాని చట్టబద్ధతపై చర్చ జరుగుతున్నప్పటికీ.. వేల మంది ప్రముఖులు ‘ఇంటర్నేషనల్ లూనార్ ల్యాండ్ రిజిస్ట్రీ' ద్వారా చంద్రుడిపై స్థలాలు కొనేస్తున్నారు. అక్కడ ఎకరం స్థలం ధర భారతీయ కరెన్సీలో రూ. 2,300గా ఉంది. ఇష్టమైనవాళ్లకు బహుమతిగా ఇవ్వడానికి మాత్రమే ఈ రిజిస్ట్రేషన్ పనికొస్తుందని, ప్రతిరోజూ దాదాపు 30 రిజిస్ట్రేషన్లు అవుతుంటాయని, వాలంటైన్స్‌ డే, మదర్స్‌ డే లాంటి సందర్భాల్లో కొనుగోళ్ల జోరు ఎక్కువగా ఉంటుందని ఈ వ్యవహారానికి సంబంధించిన నిపుణులు చెబుతున్నారు. పాకిస్తానీ యువకుడు సోహైబ్ 3300 పాకిస్తానీ రూపయాలు వెచ్చించి చంద్రుడిపై స్థలం కొన్నాడు.

తిరుమల: మంత్రి కొడాలి నాని బిగ్ బాంబ్ - మోదీని భార్యతో వెళ్లమనండి - వీర్రాజుకు పదవి తర్వాతే దాడులు

  పాక్ కి హ్యాండిచ్చిన PepsiCo, స్పాన్సర్ల వేట లో PCB || Oneindia Telugu
  ధర తక్కువే కానీ ప్రొసీజరే..

  ధర తక్కువే కానీ ప్రొసీజరే..

  చంద్రుడి మీద స్థలానికి ధర తక్కువే కానీ, దాన్ని సొంతం చేసుకునే ప్రొసీజర్ మాత్రం కఠినంగా ఉంటుందని నీరజ్ కుమార్ అంటారు. బీహార్ లోని బోధి గయకు చెందిన ఈ వ్యాపారి తాను కూడా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ స్ఫూర్తితోనే చంద్రుడిపై స్థలం కొన్నానని చెప్పాడు. ఇంటర్నేషనల్ లూనార్ ల్యాండ్ రిజిస్ట్రీలో రకరకాల పేపర్లు, పరీక్షలు దాటుకుంటూ 2019 అక్టోబర్ లో రూ.48వేలు చెల్లించానని, ఈ ఏడాది జులై4న చంద్రుడిపై ప్లాట్ రిజిస్ట్రేషన్ కు సంబంధించిన పత్రాలు అందాయని కుమార్ తెలిపారు. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి కూడా తాను చంద్రుడిపై 5ఎకరాల స్థలం కొన్నానని అప్పట్లో ప్రకటించారు. సుశాంత్ కంటే ముందు షారూఖ్ ఖాన్ కు ఓ అభిమాని చంద్రుడిపై స్థలంకొని గిఫ్టుగా ఇచ్చారు.

  English summary
  "Love you to the moon and back" is not just a saying for a Pakistani man anymore who has bought a one-acre plot of land on the moon as a wedding gift for his wife. Sohaib Ahmed, a resident of Rawalpindi, bought the lunar land in the region called 'Sea of Vapour'. The land was bought for $45 from the International Lunar Lands Registry. Ahmed said that he was inspired by late Bollywood actor Sushant Singh Rajput to buy the piece of land on the moon.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X