వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డాలర్లు పంపిస్తే న్యూడ్ ఫోటోలు.. ఆ మోడల్‌కు షాక్ ఇచ్చిన ఇన్‌స్టాగ్రామ్..

|
Google Oneindia TeluguNews

ఆస్ట్రేలియా అడవులను దహించేస్తున్న కార్చిచ్చును ఆపేందుకు అక్కడి ప్రభుత్వాలు,ప్రజలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్చిచ్చును ఆర్పేందుకు తనవంతుగా సహాయం చేస్తానని అమెరికాకు చెందిన మోడల్ కైలెన్ వార్డ్(20) ముందుకొచ్చారు. ఇందుకోసం విరాళాల సేకరణ చేపట్టి ప్రభుత్వానికి ఆర్థిక సాయం చేయాలనుకున్నారు. అయితే విరాళాల సేకరణ కోసం ఆమె భిన్నమైన పంథాను ఎంచుకున్నారు. తనకు విరాళాలు అందజేస్తే.. తన నగ్న చిత్రాలు పంపిస్తానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించారు. కైలెన్ వార్డ్ చేసిన ఈ ప్రకటనకు విశేష స్పందన లభించి దాదాపు రూ.5కోట్లు సమకూరాయి. కానీ కైలెన్ వార్డ్‌కు ఇన్‌స్టాగ్రామ్ షాక్ ఇచ్చింది.

Recommended Video

న్యూడ్ ఫోటోలను అమ్మకానికి పెట్టిన మోడల్..ఎందుకంటే..?

10 డాలర్లకు న్యూడ్ ఫోటోలు.. 2 రోజుల్లో కోట్లు కొల్లగొట్టిన సెలబ్రిటీ.. ఎందుకోసం అంటే..10 డాలర్లకు న్యూడ్ ఫోటోలు.. 2 రోజుల్లో కోట్లు కొల్లగొట్టిన సెలబ్రిటీ.. ఎందుకోసం అంటే..

ఇన్‌స్టాగ్రామ్ షాక్ :

ఇన్‌స్టాగ్రామ్ షాక్ :

విరాళాలు పంపిస్తే నగ్న చిత్రాలు పంపిస్తానని కైలెన్ ఇన్‌స్టాలో ప్రకటించడాన్ని ఇన్‌స్టాగ్రామ్ యాజమాన్యం తీవ్రంగా పరిగణించింది. ఇన్‌స్టాగ్రామ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘించేలా ఈ ప్రకటన ఉండటంతో ఆమె ఖాతాను తొలగించింది. ఈ విషయాన్ని కైలెన్ ట్విట్టర్ ద్వారా ధ్రువీకరించారు. ఇన్‌స్టా తన ఖాతాను తొలగించిందని చెప్పారు. అయితే ఆస్ట్రేలియా అడవుల్లో అగ్నికి ఆహుతవుతున్న కోలాలను రక్షించేందుకే తాను విరాళాలు సేకరించానని ఆమె తెలిపారు.

10 డాలర్లకు ఒక న్యూడ్ ఫోటో :

10 డాలర్లకు ఒక న్యూడ్ ఫోటో :

ఆస్ట్రేలియా కార్చిచ్చును ఆర్పేందుకు చేపట్టిన విరాళాల కోసం 10డాలర్లు డొనేట్ చేసేవారికి ఒక నగ్న చిత్రాన్ని పంపిస్తానని కైలెన్ వార్డ్ సోషల్ మీడియాలో ప్రకటించింది. చెప్పినట్టుగానే డొనేట్ చేసిన ప్రతీ ఒక్కరికి నగ్న చిత్రాలు పంపానని వెల్లడించింది. ఓ వ్యక్తి 5000డాలర్లు పంపించగా.. అతనికి 50 నగ్న చిత్రాలు,వీడియోలు పంపించినట్టు తెలిపింది.

కైలెన్‌పై ఆరోపణలు :

కైలెన్‌పై ఆరోపణలు :


కైలెన్ వార్డ్ చేపట్టిన విరాళాల సేకరణపై ఆరోపణలు కూడా వచ్చాయి. ఆ విరాళాల్లో కొంత మొత్తాన్ని కైలెన్ తన సొంతానికి వాడుకున్నారని కొంతమంది ఆరోపించారు. అయితే కైలెన్ మాత్రం ఆ ఆరోపణలను కొట్టిపారేశారు. ఆ డబ్బు మొత్తాన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వానికి అందజేస్తున్నట్టు తెలిపారు.

విరాళాల సేకరణలో మరికొందరు :

విరాళాల సేకరణలో మరికొందరు :

కైలెన్ వార్డ్ మాత్రమే కాదు,ఆస్ట్రేలియా కమెడియన్ సెలెస్టె బార్బర్ కూడా ఫేస్‌బుక్ ద్వారా విరాళాల సేకరణ మొదలుపెట్టాడు. ఇప్పటివరకు దాదాపు 30లక్షల డాలర్లు సేకరించాడు. హాలీవుడ్‌కి చెందిన నికోల్ కిడ్‌మాన్,ఆమె భర్త కీత్ అర్బన్ కూడా విరాళాల సేకరణ చేపట్టారు.

English summary
At a time when a major part of Australia is burning with the ravaging bushfires, a US-based model had managed to raise a sum of $700k (nearly 5 crore INR) in a period of two days through sending nudes.But such a way of raising the fund wasn't well received by Instagram's community guidelines, as her account was taken down today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X