వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నో డౌట్, అది నిజమే.. అమెరికాకు డేంజర్ బెల్స్: ఉ.కొరియాపై ఇంటలిజెన్స్ హెచ్చరిక

అమెరికాపై దాడి చేయడమంటే ఆత్మహత్య చేసుకోవడమే అన్న సంగతి ఆ దేశం గుర్తించడం లేదని కూడా పేర్కొంది.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఆ రెండు దేశాల మధ్య ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. అంతర్గతంగా ఎవరి అప్రమత్తతలో వారు యుద్దం కోసం సన్నద్దమవుతున్నారు. ఒకరు కాలు దువ్వడమే ఆలస్యం.. భీకర యుద్దానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉద్రిక్తతలను మరింత పెంచేశారు.

కిమ్ ధ్వంస రచన?: అమెరికాపై అణుదాడి తప్పదని ఉ.కొరియా సంచలన ప్రకటనకిమ్ ధ్వంస రచన?: అమెరికాపై అణుదాడి తప్పదని ఉ.కొరియా సంచలన ప్రకటన

అగ్రరాజ్యాన్ని చూసి ఉత్తరకొరియా ఇప్పటికీ ఏమాత్రం తలవంచడం లేదు సరికదా.. ఎంతకైనా తెగిస్తామన్న సంకేతాలు పంపిస్తూనే ఉంది. ఈ విషయాన్ని తాజాగా అమెరికన్ ఇంటలిజెన్స్ తమ నివేదికలో వెల్లడించడం గమనార్హం. ఉత్తరకొరియాది కేవలం మేకపోతు గాంభీర్యం అనుకోవడానికి వీల్లేదని, ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ హెచ్చరికలు అత్యంత ప్రమాదకరమైనవని నివేదికలో పేర్కొంది.

సందేహం వద్దు, నిజమే:

సందేహం వద్దు, నిజమే:

ఉత్తరకొరియా అణుక్షిపణి సామర్థ్యంపై అమెరికా లేవనెత్తుతున్న సందేహాలకు కూడా ఇందులో సమాధానమిచ్చారు. క్షిపణుల ప్రయోగం విషయంలో క్రమక్రమంగా ఉత్తరకొరియా ఎలా మెరుగైందన్నది వివరించారు.

ఉత్తరకొరియా మొట్ట మొదటి సారిగా 1984లో న్యూక్లియర్ క్షిపణి ప్రయోగం ప్రారంభించిందని, అయితే అప్పటి దాని పరిధి, ప్రభావం పరిమిత పరిధి మేరకే ఉండేవని తెలిపింది. కానీ రెండోసారి 1990లో న్యూక్లియర్ క్షిపణిని ప్రయోగించే నాటికి ఉత్తరకొరియా సామర్థ్యం మెరుగుపడిందని, ఈసారి దాని పరిధి, ప్రభావం రెండూ పెరిగాయని చెప్పుకొచ్చింది.

యుద్ద మేఘాలు: అణుదాడి వీడియోతో బెంబేలెత్తిస్తున్న కిమ్, ప్రపంచ యుద్దం తప్పదా?యుద్ద మేఘాలు: అణుదాడి వీడియోతో బెంబేలెత్తిస్తున్న కిమ్, ప్రపంచ యుద్దం తప్పదా?

సుదీర్ఘ విరామం తర్వాత 2017లొ:

సుదీర్ఘ విరామం తర్వాత 2017లొ:

ఆపై సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి 2017 జులైలో మరోసారి అణుక్షిపణి ప్రయోగాలు చేపట్టింది.ఈసారి సరికొత్త టెక్నాలజీ సహాయంతో ప్రయోగాలను కొంత పుంతలు తొక్కించింది. న్యూక్లియర్ ప్రయోగాలకు రాకెట్ ఇంజన్లను అమర్చడం ద్వారా వారి లక్ష్య ఛేధన దూరం పెంచుకోగలిగారని అమెరికన్ ఇంటలిజెన్స్ అధికారులు తెలిపారు.

కిమ్ జాంగ్‌కు రొడ్రిగో హెచ్చరిక: బొమ్మలతో ఆటలా?, పిచ్చోడా.. నువ్వో..?కిమ్ జాంగ్‌కు రొడ్రిగో హెచ్చరిక: బొమ్మలతో ఆటలా?, పిచ్చోడా.. నువ్వో..?

ఉ.కొరియా ఆత్మహత్యకు పాల్పడటం వంటిదే:

ఉ.కొరియా ఆత్మహత్యకు పాల్పడటం వంటిదే:

క్షిపణి ప్రయోగాల విషయంలో ఉత్తరకొరియా సామర్థ్యం మెరుగైనప్పటికీ అమెరికాపై దాడికి దిగడమంటే ఆ దేశం ఆత్మహత్యకు పాల్పడటమేనని అమెరికా ఇంటలిజెన్స్ అభిప్రాయపడింది. అమెరికా భూభాగాన్ని మొత్తం ఒకేసారి ధ్వంసం చేయాలని కిమ్ జాంగ్ కలలు కంటున్నారని ఇంటలిజెన్స్ పేర్కొంది.

ఉత్తరకొరియాతో గండమే?: ముక్కలు చేస్తామని హెచ్చరిక.. పుతిన్ ఇలా!ఉత్తరకొరియాతో గండమే?: ముక్కలు చేస్తామని హెచ్చరిక.. పుతిన్ ఇలా!

ఏకాకిగా ఉన్నా తెగింపు ఎక్కువే:

ఏకాకిగా ఉన్నా తెగింపు ఎక్కువే:

ఇంటలిజెన్స్ ఇచ్చిన రిపోర్టుతో అమెరికా ఇక ఉత్తరకొరియా పట్ల ఏమాత్రం అలసత్వ ధోరణిని ప్రదర్శించే అవకాశం లేదు. ఆ దేశ కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టి.. యుద్ద వాతావరణాన్ని ముందే పసిగట్టే ఎత్తులు వేయడానికి సన్నద్దమవుతోంది. ఒక్క చైనా తప్ప మరే దేశం ఉత్తరకొరియాకు బాహాటంగా మద్దతు తెలపనప్పటికీ.. అతివిశ్వాసంతో ఆ దేశం యుద్ద ప్రణాళికలకు సిద్దపడుతోంది. ఈ అతివిశ్వాసం ఇకముందు కూడా ఇలాగే కొనసాగితే అమెరికా ముందు చిత్తయిపోవడమో.. మరో ప్రపంచ యుద్దం ముంచుకు రావడమో తథ్యం.

English summary
A recent US Defense Intelligence Agency report said North Korea could produce nuclear intercontinental ballistic missiles
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X