వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంట్రెస్టింగ్: మృతదేహాల కోసం హోటల్...బాబోయ్ ఒళ్లు గొగురుపుడుతుంది

|
Google Oneindia TeluguNews

సాధారణంగా హోటళ్లు ఎందుకుంటాయండి..? దూరప్రాంతాలకు వెళ్లిన సమయంలో అక్కడ గదులు అద్దెకు తీసుకుని ఉండేందుకు. ఆహారం కూడా అక్కడే లభిస్తుంది. ఈ క్రమంలోనే వారి వారి స్థాయి లేదా హోదాకు తగ్గట్టుగా స్టార్ హోటళ్లు వచ్చేశాయి. అంటే త్రీ స్టార్, ఫైవ్ స్టార్, సెవెన్ స్టార్ లాంటి హోటళ్లు వచ్చేశాయి. అంతేకాదు తక్కువ బడ్జెట్ హోటళ్లు కూడా ఉన్నాయి. మరి కొన్ని దేశాల్లో అయితే కేవలం పిల్లులకు, కుక్కలకు కూడా హోటళ్లు ఉన్నాయంటే ఇక వాటికి ఎంత ప్రాముఖ్యత ఉందో అర్థమవుతోంది. కానీ జపాన్‌లో మాత్రం ఓ హోటల్ ఉంది... ఆ హోటల్ ఎవరికోసముందో మీరు అసలు ఊహించరు....

మృతదేహాల కోసమే హోటల్

మృతదేహాల కోసమే హోటల్

జపాన్‌లో ఎన్నో హోటళ్లున్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చే అతిథులకు ఆతిథ్యం ఇచ్చేందుకు వారి బడ్జెట్‌కు అనుగుణంగా చాలా హోటళ్లు వెలిశాయి. మీకు ఏదేశం ఆహారమైన అక్కడ లభిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఒక హోటల్‌కు చాలా ప్రత్యేకత ఉంది. ఈ పేరు వింటేనే షాక్ అవుతారు. ఇంతకీ ఆహోటల్ ఎవరికోసమో తెలుసా... మృతదేహాల కోసం. అవును మీరు చదవింది కరెక్టే... ఆ హోటల్ ఉన్నది మృతదేహాల కోసమే. వినటానికి వింతగా ఉన్నా ఇది నిజం. మృతదేహాలు హోటల్‌లో ఎలా ఉంటాయనేగా మీ డౌటు...కానీ ఇక్కడ మృతదేహాలు ఈ హోటల్‌లోనే కొలువుదీరుతాయి. ఈ హోటల్‌కు వచ్చిన కొందరు మృతదేహాలను చూసి భయపడుతుంటే మరికొందరు మాత్రం ఆసక్తితో చూస్తున్నారు.

మృతదేహాలను హోటల్‌లో భద్రపరిచేందుకు రూ.7790 ఛార్జ్ చేస్తారు

మృతదేహాలను హోటల్‌లో భద్రపరిచేందుకు రూ.7790 ఛార్జ్ చేస్తారు

ఇంతకీ ఈ హోటల్ పేరేంటో తెలుసా... దీనిపేరు లాస్టెల్. పేరు కూడా చాలా వెరైటీగా పెట్టారు. దీని ఓనర్ పేరు హిసయోషి తెరామురా. మృతదేహాలను అక్కడ ఉంచేందుకు వీరు 12వేల యాన్లు ఛార్జ్ చేస్తారు .అంటే మన దేశ కరెన్సీలో రూ.7790 అన్నమాట.ఇక లాస్టెల్ హోటల్ యొకోహామా నగరంలో ఉంది. ఇది కేవలం మృతదేహాలను ఉంచేందుకే కట్టారట. అంతకుముందు ఈ హోటల్ ఓనర్ తెరామురా మృతదేహాల కోసం కాఫిన్లు, వాటికి కావాల్సిన వస్తువులను తయారు చేసేవాడు. కానీ అనుకోకుండా మృతదేహాలకు ఒక హోటల్ నిర్మించాలన్న ఆలోచన వచ్చి వెంటనే అమలు చేశాడు. ఇప్పుడు తెరామురా టాక్ ఆఫ్ ది జపాన్‌గా నిలిచారు.

స్మశానంలో చోటు దొరికే వరకు ఈ హోటల్‌లోనే మృతదేహాలు

స్మశానంలో చోటు దొరికే వరకు ఈ హోటల్‌లోనే మృతదేహాలు

జపాన్‌లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని ఇందుకు కారణం అనారోగ్య సమస్యలు ఒకటైతే... రెండోది సహజ విపత్తులతో కూడా చాలా మంది మృతి చెందుతుంటారని తెరెమురా తెలిపాడు. దీంతో చనిపోయిన ప్రతి ఒక్కరికి శ్మశానంలో చోటు సరిపోవడం లేదు. అందుకే శ్మశానంలో చోటు దొరికే వరకు మృతదేహాలను తమ హోటళ్లలో భద్రపరుస్తామని తెరామురా చెప్పాడు.ఇక స్మశానంలో మృతదేహాలకు చోటు దొరికేవరకు వారి వద్ద నిర్భయంగా భ్రదపరచొచ్చని చెప్పారు. మృతుల కుటుంబాలు కూడా ఇది మంచి ఐడియా అని చెబుతుంటారని తెరామురా చెప్పాడు. ఇక ఈ హోటల్‌లో మృతదేహాలను భద్రపరిచేందుకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఉన్నాయి. మృతదేహాన్ని ఖననం చేసేవరకు అంటే స్మశానంలో చోటు దొరికే వరకు ఈ హోటల్‌లోనే ఉంచొచ్చు... వావ్ వాట్ యన్ ఐడియా సర్‌జీ... ఇదేనేమో.. ఒక్క చిన్న ఐడియా జీవితాన్నే మార్చేసిందంటే...

English summary
Hotels are to give you a stay when you are out of town or for any other reason. And several times we have stayed in and had a relaxing stay. We have seen or heard about every kind of hotels from low budget hotel to 5 star and 8 stars and even heard about hotels specially built for cats and dogs. But ther is a hotel in Japan which is not for any human or animal but for dead bodies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X