వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుండెపోటుతో ఈమెయిల్ సృష్టికర్త రాయ్ కన్నుమూత

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఈమెయిల్ సృష్టికర్త, ఇంటర్నెట్ హాల్ ఆఫ్ ఫేమ్ రాయ్ టామ్లిసన్ కన్నుమూశారు. ఆయన వయసు 74 ఏళ్లు. అమెరికాలోని ఆయన స్వగృహంలో ఆదివారం గుండెపోటుతో మరణించనట్లు వైద్యులు తెలిపారు. 1941, ఏప్రిల్ 23న న్యూయార్క్‌లో జన్మించిన ఆయన కంప్యూటర్ ప్రోగ్రామర్‌గా కెరీర్‌ను ప్రారంభించి, ఈమెయిల్‌ను కనిపెట్టారు.

ఆ తర్వాత ఈమెయిల్స్ వినియోగం ప్రపంచ వ్యాప్తంగా అందరూ వినియోగించేలా ఆయన కీలక పాత్ర పోషించారు. ఒక నెట్ వర్క్ నుంచి మరో నెట్ వర్క్‌కు సందేశాన్ని ఏ విధంగా బట్వాడా చేయవచ్చనే సాధ్యాసాధ్యాలపై రాయ్ టామ్లిసన్ అనేక ప్రయోగాలు చేశారు. 1971లో బోస్టన్‌లో తాను పని చేస్తున్న సంస్ధలోని తన తోటి సహోద్యోగికి మొట్టమొదటి మెయిల్‌ను విజయవంతంగా పంపారు.

Inventor of the modern email Ray Tomlinson passes away at 74

అంతేకాదు ఈమెయిల్ అడ్రస్‌లో ఉపయోగించే @ గుర్తును కూడా మొదట ఆయనే ఉపయోగించారు. తొలి రోజుల్లో టామ్లిసన్‌ ఆర్పానెట్‌ ద్వారా మొదటి ఈమెయిల్‌‌ను పంపించారు. అయితే ఆ మెయిల్‌ ఏం రాశారు అనే విషయం తనకు గుర్తులేదని, అది పూర్తిగా మర్చిపోదగిన విషయం అని టామ్లిసన్‌ గతంలో వెల్లడించారు.

టామ్లిసన్ కనిపెట్టిన ఈమెయిల్ ఇంటర్నెట్ సేవల్లో పలు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయి. కమ్యూనికేషన్‌ వ్యవస్థలోనే ఈమెయిల్‌ ఓ నూతన శకానికి నాంది పలికింది. ఇంటర్నెట్ వ్యాప్తికి విశేష కృషి చేసినందుకుగానూ రాయ్ టామ్లిసన్ 2012లో 'ఇంటర్నెట్ హాల్ ఆఫ్ ఫేమ్' గా గుర్తింపుపొందారు. ఆయన మరణం పట్ల నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Email existed in a limited capacity before Tomlinson in that electronic messages could be shared amid multiple people within a limited framework. But until his invention in 1971 of the first network person-to-person email, there was no way to send something to a specific person at a specific address.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X