వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాస్ ఏంజిల్స్ ఎయిర్ పోర్టు: 'కాల్పులు కాదు, భారీ శబ్దం వచ్చింది'

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

లాస్ ఏంజిల్స్: అమెరికాలోని లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం కాల్పుల కలకలం సృష్టించాయి. సాధారణ ప్రయాణికుడిగా ఎయిర్ పోర్ట్‌లోకి ఓ నిందితుడు సెంట్రల్ టెర్మినల్ ప్రాంతంలో పలు రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. తొలుత కాల్పుల శబ్దం విన్న సిబ్బంది వెంటనే ఈ సమాచారాన్ని అధికారులకు చెప్పడంతో వారు వేగంగా స్పందించారు.

Police investigating unconfirmed reports of shots fired at Los Angeles airport

వెంటనే స్పందించిన భద్రతా దళాలు విమానాశ్రయాన్ని ముందు జాగ్రత్తగా ఎయిర్ పోర్టుని మూసివేసి ప్రయాణికులను బయటకు పంపించి వేశారు. అమెరికాలోని స్వాట్ టీమ్స్ అక్కడికి చేరుకున్నాయి. కీలక సాయుధ బలగాలను మోహరించాయి. కాల్పులకు పాల్పడ్డాడన్న అనుమానంతో ఓ దుండగుడిని అదుపులోకి తీసుకుని విమానాశ్రయ అధికారులు విచారిస్తున్నారు.

అత్యంత భారీ భద్రత కలిగిన ఎయిర్ పోర్ట్‌లోకి దుండగుడు ఎలా ప్రవేశించాడన్న విషయంపై భద్రతా దళాలు కూపీ లాగుతున్నాయి. అయితే ఈ ఘటనలో ఎవరూ మృత్యువాత పడలేదని తెలుస్తోంది. ఎయిర్ పోర్టును తమ అధీనంలోకి తీసుకున్న భద్రతా దళాలు అణువణువూ గాలిస్తున్నాయి. ఎయిర్ పోర్టులో విమానాలను ఎక్కడికక్కడ నిలిపేశారు.

కాల్పుల ఘటన జరిగిన నేపథ్యంలో టెర్మినల్స్‌లో కొంతమంది ప్రయాణీకులు పరుగులు పెడుతూ కనిపించారు. మరికొందరు ప్రయాణీకులను సురక్షితంగా సమీపంలోని రెస్టారెంట్లకు తరలిస్తున్నారు. ప్రాణనష్టం లక్ష్యంగా ఈ దాడులు జరిపారా? లేక కేవలం ఆందోళన సృష్టించేందుకు ఈ పనిచేశారా? అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

అయితే, చివరకు ఎలాంటి కాల్పులు జరగలేదని, పెద్ద శ‌బ్దాలు మాత్రం వినిపించాయ‌ని స్వాట్ అధికారులు వెల్ల‌డించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భారీ శబ్దం వినిపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురై పరుగులు తీయడంతోనే గందరగోళం ఏర్పడించిన పోలీసులు వెల్లడించారు.

ఆ శ‌బ్దాలు వ‌చ్చిన ప్ర‌దేశాన్ని గాలిస్తున్న‌ట్లు చెప్పారు. కాల్పులు జ‌రిగిన‌ట్లు ఇద్ద‌రు వ్య‌క్తులు ఫిర్యాదు చేశార‌ని, అయితే దానిపై ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని పోలీసులు వెల్ల‌డించారు. కాల్పులు జ‌రిగిన‌ట్లు పుకార్లు రావ‌డంతో తాము ముందు జాగ్ర‌త్త‌గా గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు ట్విట్ట‌ర్‌లో తెలిపారు.

English summary
Los Angeles airport police said on Twitter late on Sunday they were investigating unconfirmed reports of shots being fired at Los Angeles International airport, with officials closing the arrival and departures areas of the central terminal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X