వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్యాంక్ ఆఫ్ బరోడాపై గుప్తా స్కాం నీలినీడలు: క్రిమినల్ చర్యలకు డీఏ సిద్ధం

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

జోహన్నెస్‌బర్గ్‌: అధ్యక్షుడు రాజీనామాకు దారితీసిన గుప్తా స్కాంపై సౌత్‌ ఆఫ్రికా ప్రతి పక్ష పార్టీ డెమెక్రాటిక్‌ అలయన్స్‌(డీఏ) ప్రభుత్వ రంగ బ్యాంకు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) పై క్రిమినల్‌ చర్యలకు సిద్ధపడుతోంది. బ్యాంకు సీనియర్ అధికారులు గుప్తా కుటుంబం యాజమాన్యంలోని కంపెనీలతో సహా, సహారా గ్రూపుకు చెందిన వివిధ కంపెనీలకు దక్షిణ ఆఫ్రికా ప్రభుత్వ సంస్థల నుండి పెద్ద ఎత్తున, వివరణ లేని చెల్లింపులు చేశారనేది ప్రధాన ఆరోపణ.
ఒక ఆంగ్ల దినపత్రికతోపాటు ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ ప్రాజెక్ట్ (ఏసీసీఆర్‌పీ) చేపట్టిన ఒక వివరణాత్మక దర్యాప్తు నేపథ్యంలో బీవోబీపై ప్రతిపక్ష పార్టీ డెమొక్రటిక్ అలయెన్స్ (డీఏ) చర్యలు చేపట్టనున్నదని నివేదించింది.

2016లోనే అధికంగా బ్యాంకులో అక్రమ లావాదేవీలు నమోదు

2016లోనే అధికంగా బ్యాంకులో అక్రమ లావాదేవీలు నమోదు

ముఖ్యంగా జూనియర్ ఉద్యోగులు లేవనెత్తిన అనుమానాస్పద లావాదేవీల నివేదికలను (ఎస్.ఆర్.ఎస్) బ్యాంకు సీనియర్ ఉద్యోగులు, అధికారులు ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టారని విమర్శించింది. జోహాన్నెస్‌బర్గ్‌ బీవోబీ శాఖలో ఈ అక్రమ లావాదేవీలు ఎక్కువగా 2016లో నమోదైనట్టు గుర్తించింది. ఈ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరపాలని డీఏ భావిస్తోంది. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ చట్టం 29, 52 సెక్షన్ల ప్రకారం దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేసింది. ఈ భారీ కుంభకోణంపై తమ పోరాటం కొనసాగుతుందని డీఏ పార్టీ ప్రతినిధి నటాషా మజ్జోన్ స్పష్టం చేశారు.

ఆఫ్రికా నేషనల్ కాంగ్రెస్ ఒత్తిడితో జుమా ఇలా రాజీనామా

ఆఫ్రికా నేషనల్ కాంగ్రెస్ ఒత్తిడితో జుమా ఇలా రాజీనామా

1990వ దశకంలో భారతదేశం నుంచి వలస వెళ్లిన గుప్తా బ్రదర్స్‌ అతుల్, అజయ్, రాజేష్ - దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్‌ జుమా సహకారంతో బిలియన్‌ డాలర్ల కుంభకోణానికి పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రభుత్వాన్ని ప్రభావితం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత సంతతికి చెందిన గుప్తా కుటుంబంతో మాజీ అధ్యక్షుడు జుమాకు గల సన్నిహిత సంబంధాలు వివాదాస్పదంగా మారాయి. వీటితోపాటు పలు అవినీతి ఆరోపణలు. చివరకు అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ఒత్తిడి తేవడంతో గతనెల 14న జుమా రాజీనామాకు దారితీసింది.

అజయ్ గుప్తాకు పోలీసుల అరెస్ట్ వారంట్

అజయ్ గుప్తాకు పోలీసుల అరెస్ట్ వారంట్

ఫిబ్రవరి 14వ తేదీనే జోహెన్నెస్‌ బర్గ్‌లోని గుప్తా భవనంపై పోలీసులు దాడి చేయడంతోపాటు అజయ్‌గుప్తాకు అరెస్ట్ వారెంట్ జారీ అయిన సంగతి తెలిసిందే. అలాగే మాజీ ప్రెసిడెంట్ కొడుకు డ్యుడ్యూజనే సహా, ముగ్గురు గుప్తా సోదరులు దుబాయ్‌కి పారిపోయారని భావిస్తున్నారు. మరోవైపు సౌత్‌ ఆఫ్రికాలో కార్యకలాపాలను నిలిపివేయాలని బీవోబీ నిర్ణయించింది. తమ కార్యకలాపాలు ఎప్పుడూ ఆ దేశంలోని చట్టాలు, నిబంధనలకు అనుగుణంగానే కొనసాగాయని వివరించింది.

English summary
India’s state-owned Bank of Baroda — one of the country’s largest — played a crucial role in the financial machinations of South Africa’s politically influential Gupta family, allowing them to move hundreds of millions of dollars originating in alleged dirty deals into offshore accounts, an investigation by the Organized Crime and Corruption Project (OCCRP) and The Hindu has found.The bank’s Indian head office denies any wrongdoing in the affair. But interviews and documents obtained by reporters prove otherwise.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X