వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆపిల్ సంస్థకు చుక్కలు చూపిస్తున్న తెలుగు అక్షరం! అన్ని డివైజ్‌లూ క్రాష్..

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: టెక్ దిగ్గజం ఆపిల్‌కు ఓ తెలుగు అక్షరం చుక్కలు చూపిస్తోంది. ఆ సంస్థకు చెందిన ఐఫోన్ యూజర్లను 'జ్ఞా' అక్షరం కలవరపెడుతోంది. ఆపిల్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు చెందిన కొన్ని వెర్షన్లలో తలెత్తిన బగ్ కారణంగా ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ లాంటి ఆపిల్ డివైజ్‌లు క్రాష్ అవుతున్నాయి.

'జ్ఞా' అనే అక్షరాన్ని ఐఫోన్లకు పంపినా లేదా టెక్స్ట్ ఎడిటర్‌లో ఎంటర్ చేసినా అది క్రాష్ అవుతున్నట్లు గురించారు. ఈ మేరకు ఐఓఎస్ 11, మ్యాక్ ఓఎస్ హై సియెర్రా, వాచ్ ఓఎస్ 4, టీవీ ఓఎస్ 11ల్లో తలెత్తిన బగ్‌ను ఫిక్స్ చేస్తున్నట్లు ఆపిల్ కంపెనీ తెలియజేసింది.

iPhones, iPads and Macs Crashed by Indian Telugu Character Sent via SMS, Whatsapp and Other Apps

పాత వెర్షన్లలో ఈ సమస్య లేదని, ప్రస్తుత ఓఎస్‌లోని బీటా ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఈ బగ్‌ను ఫిక్స్ చేశామని కంపెనీ తెలిపింది. 'జ్ఞా' అక్షరాన్ని రిసీవ్ చేసుకోగానే ఐ మెసేజ్, వాట్సాప్, జీమెయిల్, ఫేస్‌బుక్ మెసేంజర్ లాంటి యాప్‌లు రెస్పాండ్ కావడం లేదని తెలుస్తోంది.

'జ్ఞా' అక్షరాన్ని లేదా ఆ అక్షరం ఉన్న పూర్తి మెసేజ్‌ను డిలీట్ చేసేంత వరకూ యాప్స్ మొరాయిస్తున్నాయి. ఆ అక్షరాన్ని డిలీట్ చేశాకే తిరిగి మాములుగా పని చేస్తున్నాయి. మొబైల్ వరల్డ్ అనే ఇటాలియన్ బ్లాగ్ ఈ బగ్‌ గురించి తొలిసారిగా వెలుగులోకి తీసుకొచ్చింది.

English summary
Apple is scrambling to fix a glitch in its latest software update which allows people to send a “text bomb” that can crash many of its devices. The error occurs when a single character from Telugu - a language native to India and spoken by about 70 million people - is received by some devices or typed into a text editor. The glitch affects iPhones, iPads, Macs, Apple Watch and Apple TV running the latest versions of their operating software.The issues causes apps - including iMessage, WhatsApp, Gmail and Facebook Messenger - to crash or become unresponsive.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X