వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గూగుల్ ట్రెండ్ : శ్రీలంక బ్లాస్ట్ తర్వాతే ఐపీఎల్, 2 మిలియన్ నెటిజన్ల సెర్చ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంకలో భీతావాహ వాతావరణం నెలకొంది. ఎటుచూసినా రక్తపుటేరులు, బంధువుల ఆర్తనాదాలతో మిన్నంటింది. ఈ క్రమంలో సెర్చింజన్ గూగుల్‌లో శ్రీలంక పేలుళ్లకు సంబంధించిన ఇష్యూ ట్రెండ్ అవుతోంది. ఎంతలా అంటే క్రీడల్లో దిగ్గజమైన ఐపీఎల్‌ను కాదని .. నెటిజన్లు శ్రీలంక బ్లాస్ట్ గురించి సెర్చ్ చేశారు.

’వేర్ ఈజ్ శ్రీలంక‘

’వేర్ ఈజ్ శ్రీలంక‘

ఆదివారం జరిగిన మహోగ్ర దాడిలో చనిపోయిన వారి సంఖ్య 310కి చేరుకొంది. 500 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. దేశంలో ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా ఎమర్జెన్సీ విధించారు. దీంతో శ్రీలంకలో ఏం జరుగుతుందోనని నెటిజన్లు ఆసక్తిగా చూస్తున్నారు. అమెరికా, కెనడా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఇతర దేశాలకు చెందిన ప్రజలను 'వేర్ ఈజ్ శ్రీలంక‘ హ్యాష్ ట్యాగ్‌తో సెర్చ్ చేస్తున్నారు. వాస్తవానికి ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. ఐపీఎల్ మ్యాచులంటే క్రికెట్ ప్రేమికులు చెవి కోసుకోవాల్సిందే. కానీ ఇలాంటి తరుణంలో వరుస పేలుళ్లతో .. శ్రీలంక బ్లాస్ట్ తొలిస్థానానికి చేరిపోయింది.

అన్నీ చూపులు అటు వైపే ..

అన్నీ చూపులు అటు వైపే ..

ఆదివారం శ్రీలంకలో పేలుళ్లు జరిగాక ఉధయం 11.06 గంటల నుంచి సాయంత్రం 4.46 గంటల వరకు బ్లాస్ట్‌కు సంబంధించిన అంశాలనే చూస్తున్నారు. వాస్తవానికి శని, ఆదివారాల్లో రెండు ఐపీఎల్ మ్యాచులు ఉంటాయి. ఆదివారం మొదటి ఐపీఎల్ మ్యాచ్ మొదలైన .. నెటిజన్లు మాత్రం శ్రీలంకలో ఏం జరుగుతుంది ? అక్కడున్న వారి పరిస్థితి ఏంటి అనే ఆలోచించారు. సాయంత్రం 4.26 గంటల నుంచి రాత్రి 7.06 గంటల వరకు శ్రీలంక గురించి వందలో 97 మంది వెతికితే కేవలం 42 మంది మాత్రమే ఐపీఎల్ మ్యాచ్ సమాచారం కోసం సెర్చ్ చేశారని పేర్కొంది.

ఆ తర్వాతే వేరే ఇష్యూ ..?

ఆ తర్వాతే వేరే ఇష్యూ ..?

ఆదివారమే కాదు సోమవారం కూడా శ్రీలంక పేలుళ్లకు సంబంధించిన విషయాల గురించి గూగుల్‌లో వెతికారు నెటిజన్లు. ఆదివారం మాత్రం శ్రీలంక తర్వాత మాల్దీవులు, ఖతార్, యూఏఈ, డెన్మార్క్ గురించి శోధించారు.

బ్లాస్ట్ గురించే సెర్చ్

బ్లాస్ట్ గురించే సెర్చ్

ఆదివారం రోజున శ్రీలంక గురించి 2 మిలియన్ ప్రజలు గూగుల్‌లో శోధించారు. ఐపీఎల్‌లో ఆర్సీబీ వర్సెస్ సీఎస్కే, ఆర్ఆర్ వర్సెస్ డీసీ, కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ అంటే ఎంత క్రేజో ... బాంబు పేలుళ్లతో తల్లడిల్లిన పోరుగు దేశం గురించి తెలుసుకునేందుకు కూడా అంతే తాపత్రాయపడ్డారు. ఇక మనదేశం విషయానికి వస్తే మిజోరంకి చెందిన యువత ఐపీఎల్ కాదని .. శ్రీలకం పేలుళ్ల గురించి అన్వేషించిందని గూగుల్ పేర్కొంది.

English summary
the death toll in the serial blasts that shook Sri Lanka on Sunday has crossed 310. The country has declared a state of emergency and is observing national mourning. More than 500 people have been injured in the nine blasts that took place at churches and high-end hotels in Colombo and Negombo. This is one of the worst terror attacks in South Asia in the past decade. However, on the day when Sri Lanka was going through the horror of these serial bomb blasts, the world was more curious to know about Game of Thrones and the Indian Premier League (IPL).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X