వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా భయంలోనూ రాత్రంతా రోడ్ల మీదే బిక్కుబిక్కుమంటూ గడిపిన జనం.. కారణం?

|
Google Oneindia TeluguNews

టెహ్రాన్: ఒకవంక కరోనా వైరస్ వెంటాడుతోంది. మరోవంక లాక్‌డౌన్ పరిస్థితులు.. అయినప్పటికీ వందలాది మంది ప్రజలు రాత్రంతా రోడ్ల మీదే బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఇళ్లను ఖాళీ చేసి, రోడ్ల మీదికి పరుగులు తీశారు. కొందరు రోడ్ల మీదే కునుకు తీయగీ..మరికొందరు కార్లలో తలదాచుకున్నారు. కారణం.. భూకంపం. రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రతతో నమోదైన భూకంపం ఇరాన్‌ను ఇట్టే వణికించింది. ఈ భూకంపంలో ఇద్దరు మరణించగా.. 22 మంది గాయపడ్డారు.

Recommended Video

Vizag Gas Leak Again At Midnight, Explode Panic Leads Locals Came On Roads

ఇరాన్ కాలమానం ప్రకారం.. శుక్రవారం రాత్రి 8:18 నిమిషాలకు ఈ భూకంపం సంభవించింది. రాజధాని టెహ్రాన్, తూర్పు ప్రాంతంలోని దమావంద్ నగరంలో భూకంప తీవ్రత భారీగా కనిపించింది. దమావంద్ నగర శివారు ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూ ఉపరితలం నుంచి సుమారు ఆరు కిలోమీటర్ల లోతున పెను భూకంపం సంభవించిందని నిర్ధారించింది.

భూకంపం ప్రభావం దమావంద్, టెహ్రాన్‌లల్లో కనిపించింది. భారీగా ఆస్తినష్టం సంభవించలేదు. అయినప్పటికీ.. పలు నివాసాలు, భవన సముదాయాలు బీటలు వారినట్లు గుర్తించారు. భూమి కంపించడంతో స్థానికులు ఇళ్లను వదిలి బయటికి పరుగులు తీశారు. భయాందోళనల మధ్య గడిపారు. భూకంపం తరువాతా దానికి సంబంధించిన ప్రకంపనలు స్పలంగా చోటు చేసుకుంటుండటంతో ఇళ్లకు వెళ్లడానికి భయపడ్డారు.

Iran: 5.1-magnitude earthquake felt in Tehran

ఆ సమయంలోనూ సోషల్ డిస్టెన్సింగ్‌ను పాటించాల్సిందిగా ఇరాన్ ప్రభుత్వం హెచ్చరికలను జారీ చేసింది. సోషల్ మీడియా ద్వారా వాటిని విస్తృతంగా ప్రచారంలోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఇరాన్‌లో లక్షమందికి పైగా కరోనా వైరస్ బారిన పడి, ఆసుప్రతుల్లో చికిత్స పొందుతున్నారు. 6,486 మంది మరణించారు. కరోనా వైరస్ ఈ స్థాయిలో ఉన్న నేపథ్యంలో భూకంపం సంభవించడం మరింత ఆందోళనకు గురి చేసింది.

English summary
An earthquake measuring 5.1 on the Richter scale occurred near Damavand at 00:48 local time on Friday which was felt in Tehran. According to Tehran University's Geophysics Center, the earthquake occurred seven kilometers underground six kilometers from Damavand, a city in the eastern capital, at 35.78 latitude and 52.05 longitude.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X