వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విమానం కుప్పకూలడం వెనుక ట్విస్ట్: ఇరాన్ క్షిపణుల దెబ్బకు ముక్కలు: పసిగట్టిన శాటిలైట్లు..!

|
Google Oneindia TeluguNews

టెహ్రాన్: ఇరాన్ రాజధాని టెహ్రాన్‌ సమీపంలో ఉక్రెయిన్‌కు చెందిన విమానం కుప్పకూలిపోవడానికి గల అసలు కారణాలను అమెరికా వెల్లడించింది. ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలు ఎయిర్‌బేస్‌పై ఇరాన్ వైమానిక దాడులను చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే చోటు చేసుకున్న ఈ విషాదకర ఘటన.. సాంకేతిక లోపాల వల్ల తలెత్తినది కాదని స్పష్టం చేసింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల వల్లే ఉక్రెయిన్ విమానం కుప్పకూలిందని ప్రకటించింది.

ఇరాన్ దూకుడు..ఈ సారి రాకెట్లు: అమెరికా రాయబార కార్యాలయం టార్గెట్‌గా..!ఇరాన్ దూకుడు..ఈ సారి రాకెట్లు: అమెరికా రాయబార కార్యాలయం టార్గెట్‌గా..!

అమెరికా సైనిక స్థావరాలపై దాడి వెంటే..

అమెరికా సైనిక స్థావరాలపై దాడి వెంటే..

ఉక్రెయిన్ విమాన ప్రమాదానికి గల కారణాలపై చేపట్టిన దర్యాప్తు సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. టెహ్రాన్‌లోని ఇమామ్ ఖొమేనీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న కొన్ని నిమిషాల్లోనే ఉక్రెయిన్ విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. అంతకుముందే- ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ 22 క్షిపణులను ప్రయోగించిన నేపథ్యంలో.. ఈ ఘటనపై పలు అనుమానాలు తలెత్తాయి. సాంకేతిక కారణాల వల్లే విమానం కుప్పకూలినట్లు తొలుత నిర్ధారించారు.

క్షిపణుల ప్రయోగాన్ని పసిగట్టిన అమెరికా ఉపగ్రహాలు..

క్షిపణుల ప్రయోగాన్ని పసిగట్టిన అమెరికా ఉపగ్రహాలు..

176 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బందిని పొట్టన బెట్టుకున్న ఈ ఘటన వెనుక సాంకేతిక కారణాలేవీ లేవనే విషయాన్ని అమెరికా నిర్ధారించింది. ఇరాన్ వైమానిక దళం.. రెండు క్షిపణులను ప్రయోగించిందని స్పష్టం చేసింది. ఉపగ్రహాలు తీసిన ఫొటోలు, డేటాలను విశ్లేషించింది. భూఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాన్ని ఛేదించే సత్తా ఉన్న రెండు క్షిపణులను ఇరాన్ వైమానిక దళం ప్రయోగించిందని తేలినట్లు నిర్ధారించింది.

Recommended Video

US House Votes To Clip Trump's Wings On Iran || Oneindia Telugu
 ఉద్దేశపూరకంగా చేసింది కాదంటూ..

ఉద్దేశపూరకంగా చేసింది కాదంటూ..

ఇరాన్ ఉద్దేశపూరకంగా ఉక్రెయిన్ విమానంపై దాడి చేయలేదని ఈ దర్యాప్తునకు సారథ్యాన్ని వహించిన కెనడా ప్రధానమంత్రి జస్టిస్ ట్రుడో వెల్లడించారు. పొరపాటున పౌర విమానంపైకి క్షిపణులను ప్రయోగించి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ విమాన ప్రమాదంలో 63 మంది కెనడా దేశస్తులతో పాటు 82 మంది ఇరానీయన్లు, 11 మంది ఉక్రెయినర్లు, 10 మంది స్వీడన్ పౌరులు దుర్మరణం పాలయ్యారు. ఆయా దేశాల అధికారులు సంయుక్తంగా ఈ దర్యాప్తులో పాల్గొన్నారు.

English summary
A Ukraine airliner that crashed in Iran, killing all 176 people aboard, was most likely brought down accidentally by Iranian air defenses, U.S. officials said on Thursday, as President Donald Trump said he had a terrible feeling about the disaster.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X