వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాతో స్నేహం - భారత్ కు మరో నమ్మకమైన మిత్రుడు దూరం- చైనాతో భారీ డీల్...

|
Google Oneindia TeluguNews

చైనాతో సరిహద్దు ఘర్షణలు మొదలయ్యాక భారత్ అనుసరిస్తున్న రక్షణాత్మక ధోరణి అంతర్జాతీయంగా మన దేశానికి నమ్మకమైన మిత్రులను దూరం చేసేలా కనిపిస్తోంది. గతంలో అలీన విధానం పేరుతో అందరికీ సమదూరం పాటించిన నెహ్రూ విధానాన్ని వదిలిపెట్టి వ్యూహాత్మక సంబంధాల పేరుతో భారత్ వేస్తున్న అడుగులు భారత్ కు పాత మిత్రులను సైతం దూరం చేస్తున్నాయి. ఇప్పటికే అమెరికాతో పెరుగుతున్న సంబంధాలతో బలమైన మిత్ర దేశం రష్యా దూరం కాగా... ఇరాన్ కూడా అదే బాటలో ఉన్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

భారత్ కు మిత్రదేశం ఇరాన్ ఊరట.. చైనా, అమెరికాకు షాకిస్తూ - అవన్నీ పుకార్లేనంటూ..భారత్ కు మిత్రదేశం ఇరాన్ ఊరట.. చైనా, అమెరికాకు షాకిస్తూ - అవన్నీ పుకార్లేనంటూ..

ఒక్కొక్కరుగా దూరం...

ఒక్కొక్కరుగా దూరం...

చైనాతో సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వద్ద కొన్నేళ్లుగా చోటు చేసుకుంటున్న ఘర్షణలు భారత్ కు ఇబ్బందికరంగా మారిపోయినట్లు కనిపిస్తోంది. చైనాతో ఢీ అంటే ఢీ అనే ధోరణి ప్రదర్శిస్తున్న భారత్ ను ఆర్దికంగా దెబ్బకొట్టేందుకు చైనా అన్ని అస్త్రాలూ వాడేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే మనకు పొరుగుదేశాలైన నేపాల్, భూటాన్, శ్రీలంక తో పాటు ఉపఖండ దేశాలన్నింటికీ ఎర వేస్తున్న చైనా ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా భారత్ కు మిత్రదేశాలను దూరం చేసే పనిలో బిజీగా ఉంది. అమెరికా మాయలో పడి భారత్ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ఇందుకు ఊతమిచ్చేలా ఉన్నాయి. దీంతో పాత మిత్రులంతా చైనా ఒత్తిడికి తలొగ్గి ఒక్కొక్కరుగా మనకు దూరమయ్యే పరిస్ధితులు కనిపిస్తున్నాయి.

 మిత్రదేశం ఇరాన్ యూటర్న్...

మిత్రదేశం ఇరాన్ యూటర్న్...


అరబ్ ప్రపంచంలో భారత్ కు ఇన్నాళ్లూ నమ్మకమైన మిత్రుడిగా ఉన్న ఇరాన్ పైనా చైనా వ్యూహాలు ఫలిస్తున్నాయి. యూరప్, మధ్య ఆసియా దేశాలకు సరకు రవాణా చేసే నార్త్-సౌత్ కారిడార్ కు కీలకమైన చబహార్ పోర్టు, ఆప్ఘనిస్తాన్ మీదుగా రోడ్, రైల్ కారిడార్ నిర్మాణం విషయంలో భారత్ తో ఒప్పందాన్ని నాన్చుతూ వచ్చిన ఇరాన్.... తాజాగా దాన్ని మేం మొదలుపెడతాం, తర్వాత వచ్చి చేరొచ్చంటూ కొర్రీ పెట్టింది. 50 కోట్ల డాలర్లతో భారత్ ఈ ప్రాజెక్టులో భాగస్వామి కావాల్సి ఉండగా.. 40 కోట్ల డాలర్లతో తామే ఈ పనులు చేపడతామని ఇరాన్ తాజాగా చేసిన ప్రకటన భారత్ కు భారీ షాక్ ఇచ్చింది. ఇప్పుడు చైనా 2016లో ప్రతిపాదించిన 40 వేల కోట్ల డాలర్ల ఒప్పందాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఈ ఒప్పందం సాకారమైతే చైనాతో ఇరాన్ సంబంధాలు బలపడటం ఖాయం.

ఇరాన్-చైనా ఒప్పందం...

ఇరాన్-చైనా ఒప్పందం...


2016లో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఇరాన్ పర్యటన సందర్భంగా 40 వేల కోట్ల డాలర్ల ఖర్చుతో ఇరుదేశాల మధ్య పాతికేళ్లలో చమురు క్షేత్రాల అభివృద్ధితో పాటు రోడ్డు, రైలు, విమాన మార్గాల అభివృద్ధికి భారీ డీల్ ప్రతిపాదించారు. బదులుగా ఇరాన్ కు చైనాకు సబ్సిడీపై చమురు సరఫరా చేయడంతో పాటు చైనాతో పలు ఒప్పందాలు కుదుర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. గతంలో చైనా ఈ ఒప్పందం ప్రతిపాదించినప్పుడు అణు కార్యక్రమంతో బిజీగా ఉన్న ఇరాన్.. ఇప్పుడు మారిన పరిస్ధితుల్లో చైనా సహకారం అవసరమని భావిస్తోంది. ముఖ్యంగా ఇరాన్ చమురు దిగుమతుల విషయంలో అమెరికా నుంచి ఇతర దేశాలపై ఎదురవుతున్న ఒత్తిడి నేపథ్యంలో చైనా సహకారం తప్పనిసరి అని ఆ దేశం భావిస్తోంది. చైనాతో స్నేహం చేస్తే అణుకార్యక్రమం విషయంలోనూ ఆ దేశం సాయం లబించనుండటం ఇరాన్ కు కలిసివచ్చే అంశం.

Recommended Video

#Watch COVID Asymptomatic Patients Flash Mob| Pune Girl Grand Welcome to Sister- Videos Viral
భారత్ తప్పిదాలతో మిత్రులు దూరం..

భారత్ తప్పిదాలతో మిత్రులు దూరం..


పొరుగుదేశం చైనాతో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో మిత్రదేశాలకు మరింత దగ్గరవ్వాల్సిన భారత్.. అమెరికా మాయలో పడి వారిని దూరం చేసుకుంటున్న పరిస్ధితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే శ్రీలంక, మయన్మార్, నేపాల్, భూటాన్ ప్రభుత్వాలపై చైనా ఒత్తిడి విపరీతంగా ఉంది. వీటిలో భారత్ గతంలో చేపట్టిన ప్రాజెక్టులు కూడా నిలిచిపోయే పరిస్ధితి. ఇప్పుడు ఇరాన్ తో ప్రాజెక్టులు కూడా పట్టాలు తప్పాయి. కానీ భారత్ ఇవేవీ పట్టించుకోకుండా అమెరికాతో స్నేహం చేయడం ద్వారా ఈ దేశాల అవసరం లేకుండా చేసుకోవాలనే ఆలోచనతో ఉంది. అయితే తాజాగా ట్రంప్ మాజీ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ చెప్పినట్లు చైనా భారత్ పొరుగుదేశాలనే కాదు అమెరికాను సైతం ప్రభావితం చేసే పరిస్ధితిలో ఉంది. అధ్యక్ష ఎన్నికల తర్వాత చైనాతో భారీ డీల్ కు అమెరికా సిద్ధపడే అవకాశాలు ఉన్నాయని జాన్ బోల్టన్ తన పుస్తకంలో రాసిన అంశాలు భారత్ కు హెచ్చరికలే.

English summary
after growing indo-american relations amid indo-china border tensions, india's old friend iran has given a big shock to our country. iran plans to reinstate proposed old deal worth $40k cr with china.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X