వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోగ్ అడ్వెంచరిజమ్: అంతర్జాతీయ ఉగ్రవాద చర్యగా: కయ్యానికి సై: ఇరాన్..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

అమెరికా vs ఇరాక్ ఇరాన్ | మూడో ప్రపంచ యుద్ధం కోసమా ?

టెహ్రాన్: అమెరికా వైమానిక దాడుల్లో తమ సైన్యాధ్యక్షుడు ఖాసిం సోలేమని మరణించడం పట్ల ఇరాన్ మండిపడుతోంది. అమెరికాపై కయ్యానికి కాలు దువ్వేలా కనిపిస్తోంది. అమెరికా మూర్ఖత్వానికి ఈ పరిణామం ఓ నిదర్శనమని, దీనికి తగిన మూల్యాన్ని తప్పకుండా చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. రోగ్ అడ్వెంచరిజమ్ గా అభివర్ణించింది. అంతర్జాతీయ ఉగ్రవాద చర్యగా పేర్కొంది. అమెరికా రాయబార కార్యాలయ ప్రతినిధిగా వ్యవహరిస్తోన్న స్విట్జర్లాండ్ హైకమిషనర్ కు సమన్లను జారీ చేసింది.

అమెరికా మెరుపుదాడి..బాంబుల వర్షం: ఇరాన్ ఆర్మీ చీఫ్ దుర్మరణం: ట్రంప్ ఆదేశాలమేరకే: పెంటగాన్.. !అమెరికా మెరుపుదాడి..బాంబుల వర్షం: ఇరాన్ ఆర్మీ చీఫ్ దుర్మరణం: ట్రంప్ ఆదేశాలమేరకే: పెంటగాన్.. !

ఉద్దేశపూరకమే..

ఉద్దేశపూరకమే..

అమెరికా వైమానిక దళాలు చేసిన ఇరాక్ పై దాడి చేసిన ఘటనలో ఇరాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖాసిం సోలెమని దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఖాసింను లక్ష్యంగా చేసుకుని, ఉద్దేశపూరకంగానే తాము బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై క్షిపణులతో దాడి చేసినట్లు అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం ప్రకటించింది. డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతోనే తాము ఆ చర్యకు దిగినట్లు స్పష్టం చేసింది.

అమెరికా రాయబారికి సమన్లు..

అమెరికా రాయబారికి సమన్లు..

ఆయనతో పాటు ఉన్న ఇరాక్ కుర్దీష్ మిలీషియా పాపులర్ మొబిలైజేషన్ ఫోర్స్ (పీఎంఎఫ్) డిప్యూటీ కమాండర్ మెహది-అల్-ముహండీ కూడా మరణించారు. ఈ దాడి వెంటనే ఇరాన్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అమెరికా చర్య పట్ల ఇరాన్ నిప్పులు చెరుగుతోంది. ఏ ఉద్దేశంతో తమ సైనికాధిపతిని లక్ష్యంగా చేసుకున్నారో వివరించాలని ఆదేశించింది. ఈ మేరకు అమెరికా రాయబారికి సమన్లను జారీ చేసింది.

అంతర్జాతీయ ఉగ్రవాదిగా..

అంతర్జాతీయ ఉగ్రవాదిగా..

అమెరికా చర్య అంతర్జాతీయ ఉగ్రవాదానికి ఏ మాత్రం తీసిపోయేలా లేదంటూ ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి జవాద్ జరీఫ్ ఆరోపించారు. ఇస్లామిక్ స్టేట్స్, అల్ ఖైదాలతో సమానంగా అమెరికా వ్యవహరించిందని విమర్శించారు. ఐసిస్, అల్ ఖైదాలను కట్టడి చేయడంలో కీలకపాత్ర పోషించిన ఖాసింను హతమార్చడం మూర్ఖపు చర్య అని మండిపడ్డారు. దీనికి తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

పండగ చేసుకుంటున్న ఇరాకీయులు..

పండగ చేసుకుంటున్న ఇరాకీయులు..

ఇదిలావుండగా- ఖాసిం మరణించడం పట్ల ఇరాక్ ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల మీదికి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. ఖాసిం చనిపోయాడనే విషయాన్ని టెలివిజన్లు, సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న వెంటనే ఇరాకీయులు ఆనందంతో చిందులేశారు. రాజధాని బాగ్దాద్ లో భారీ ప్రదర్శన నిర్వహించారు. తమ దేశ పతాకాన్ని ప్రదర్శించారు. కేరింతలు కొడుతూ, పరస్పరం అభినందనలను తెలుపుకొన్నారు.

English summary
Iran Foreign Minister Javad Zarif: US' act of international terrorism,assassinating General Soleimani—the most effective force fighting Daesh (ISIS),Al Nusrah,Al Qaeda,is extremely dangerous & foolish escalation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X