వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

92కి చేరిన ఇరాన్ కరోనా మృతుల సంఖ్య, ఇతరదేశాల్లో పెరుగుతోన్న మరణాలు..

|
Google Oneindia TeluguNews

చైనా తర్వాత ఇరాన్‌లోనే కరోనా మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. చైనాలో 2900 మందికి పైగా రోగులు మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే. ఇక ఇరాన్ దేశంలో ఆ సంఖ్య 92కి చేరింది. మృతుల సంఖ్య పెరగడంతో ఆ దేశ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Iran toll rises to 92 as global outbreak deepens..

చైనాతోపాటు ఇటలీ, అమెరికా, ఇరాన్‌లో మృతులు పెరగడంతో.. ఆయా దేశాలకు ప్రజలు వెళ్లాలంటేనే జంకుతున్నారు. కరోనా వైరస్ అనుమానితుల సంఖ్య 93 వేలకు చేరింది. వారికి పరీక్షలు చేస్తూనే ఉన్నారు. అనుమానం వచ్చిన వారిని ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు.

కరోనా వైరస్‌తో ప్రపంచవ్యాప్తంగా భయాందోళన నెలకొంది. వైరస్ ఎలా వస్తోంది.. దేని ద్వారా వ్యాపిస్తోందనే అంశంపై క్లారిటీ లేదు. వైరస్ ఎలా వస్తుందో తెలియనప్పుడు.. దానికి మందు కనుగొనడం కూడా అంతా ఈజీ కాదు... కానీ పెద్దన్న అమెరికా మాత్రం కరోనా వైరస్‌కు మందు కనుగొంటామని పేర్కొన్నది.

అయితే మరోవైపు వెకేషన్ కోసం ఇటలీ వెళ్లిన పేటీఎం ఉద్యోగి కరోనా వైరస్ బారినపడ్డారు. సోమవారం విధుల్లో చేరారు. అయితే అస్వస్థతకు గురవడంతో.. బుధవారం సప్తార్‌బంగ్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ కరోనా వైరస్ పాజిటివ్ బయటపడింది. దీంతో భయాందోళన నెలకొంది.

English summary
in iran corona death toll is 92 and global figures also increased.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X