వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుద్ధం కోరుకోవడం లేదు కానీ..: ఇరాన్ దాడిపై డొనాల్డ్ ట్రంప్ స్పందన, అణ్వాయుధం చిక్కనివ్వం

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఇరాన్ చేసిన దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్ జరిపిన దాడిలో అమెరికన్లు ఎవరూ గాయపడలేదని స్పష్టం చేశారు. మనదేశ కాలమాన ప్రకారం బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో డొనాల్డ్ ట్రంప్ మీడియా సమావేశంలో మాట్లాడారు.

అణ్వాయుధం చిక్కనివ్వం..

ఇరాన్‌కు అణుబాంబు(అణ్వాయుధం)ను చిక్కనివ్వమని ఆయన అన్నారు. ఇరాన్ తీవ్ర వాదాన్ని ప్రోత్సహిస్తోందని ట్రంప్ ఆరోపించారు. సులేమానీ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లాకు మద్దతిచ్చారని అన్నారు. సులేమానీని గతంలోనే చంపాల్సిందని ఆయన అన్నారు.

సులేమానీ చంపడం తప్పేం కాదు..

సులేమానీని చంపడం తప్పేమీ కాదని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు ఇరానే కారణమని ఆయన అన్నారు. ఇరాన్‌ను ప్రపంచ దేశాలు ఒంటరిని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇరాన్‌కు హెచ్చరిక..

ఇరాన్‌కు హెచ్చరిక..

ఇరాన్ తన అన్వాయుధ కార్యక్రమాలను విరమించుకోవాలని డొనాల్డ్ ట్రంప్ సూచించారు. ఇరాన్ దారికి రాకుంటే కఠిన చర్యలుంటాయని, ఆంక్షలు మరిన్ని అమలు చేస్తామని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని కొనసాగనివ్వమని అన్నారు. చాలా దేశాలు ఇరాన్‌ను సహిస్తూ వస్తున్నాయని ట్రంప్ అన్నారు. జీవితం మీద ఆశ ఉంటే తమపై దాడులు చేయవద్దని ముందే ఉగ్రవాదులకు సందేశాలు పంపించామని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.

యుద్ధం కోరుకోవడం లేదు కానీ..

యుద్ధం కోరుకోవడం లేదు కానీ..

అయితే, అమెరికా ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్‌కు గొప్ప భవిష్యత్ ఉండాలనుకుంటే.. శాంతి మార్గంలో నడవాలని ట్రంప్ హితవు పలికారు. లేదంటే మూల్యం చెల్లించుకోకతప్పదంటూ హెచ్చరించారు.ఒకవేళ ఇరాన్ ఇంకా దాడులకు పాల్పడితే అమెరికా బలగాలు అందుకు సిద్ధంగా ఉన్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇరాన్ వెనక్కి తగ్గినట్లు అనిపిస్తుందని, ఇది ఒకందుకు మంచిదేనని అన్నారు.

English summary
Donald Trump says As long as I am the President, Iran will never be allowed to have nuclear weapon
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X