వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇరాక్‌లో ఉగ్రవాదుల మారణహోమం, ఒకే ప్రాంతంలో రెండుసార్లు దాడి, 60 మంది మృతి

ఇరాక్‌లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. ఒకే ప్రాంతంలో రెండుసార్లు దాడికి దిగారు. నసిరియా ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌లోకి చొరబడిన ఉగ్రవాదులు అక్కడ ఉన్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

నసిరియా: ఇరాక్‌లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. ఒకే ప్రాంతంలో రెండుసార్లు దాడికి దిగారు. నసిరియా ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌లోకి చొరబడిన ఉగ్రవాదులు అక్కడ ఉన్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

ఈ ఘటన జరిగిన కొద్ది సమయానికి దగ్గర్లోని భద్రతా సిబ్బంది చెక్‌ పాయింట్‌ వద్ద కారు బాంబుతో దాడి చేశారు. ఈ దాడిలో దాదాపు 60 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 90 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

iraq-twin-incidents

ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. దాడి కారణంగా ఆ ప్రాంతమంతా ఛిద్రమైన శరీరాలు, రక్తంతో భీతావహంగా మారింది.

మృతుల్లో ఏడుగురు ఇరానీయులు కూడా ఉన్నట్లు ఆ ప్రాంత అధికారి జస్సీమ్‌ అల్‌ ఖాలిది తెలిపారు. ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ఇప్పటి వరకూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. కానీ ఇవి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల దుశ్చర్యలుగానే భావిస్తున్నారు.

English summary
A suicide bomber detonated a vest and gunmen opened fire inside a restaurant near Nasiriya, capital of Dhiqar province, security sources said. Soon afterwards, a car bomb exploded at a nearby checkpoint.So-called Islamic State said it carried out the attacks. Shia Muslim pilgrims including Iranians were killed by the suspected militants. According to news agency AFP, one report said the attackers were disguised as members of Hashd al-Shaabi (Popular Mobilisation) - a mainly Shia group that has fought alongside Iraqi forces against IS. The attackers struck at midday local time (09:00 GMT) in stolen army vehicles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X