• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

షాకింగ్: ఆస్పత్రిలో ఆక్సిజన్ ట్యాంక్ పేలుడు -27మంది కొవిడ్ రోగులు దుర్మరణం, మరో 50 మందికి

|

కరోనా మహమ్మారి రెండో దశ విలయంలో వైరస్ మరణాలకుతోడు ఘోర ప్రమాద సంఘటనలూ పెరిగిపోతున్నాయి. ఇటీవలే భారత్ లోని మహారాష్ట్ర(నాసిక్)లో ఆక్సిజన్ లీకై 24 మంది కొవిడ్ రోగులు మృతిచెందడం, పల్‌ఘర్ జిల్లాలోని మరో ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగి 13 మంది రోగులు చనిపోవడం తెలిసిందే. తాజాగా పశ్చిమ ఆసియా దేశం ఇరాక్ లో మరో పెను విషాదం చోటుచేసుకుంది. వందల సంఖ్యలో కొవిడ్ రోగులు చికిత్స పొందుతోన్న ఆస్పత్రిలో ఆక్సిజన్ ట్యాంకర్ పేలడంతో 27 మంది రోగులు సజీవదహనం అయ్యారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..

జర్మనీ నుంచి ఆక్సిజన్ ప్లాంట్లు దిగుమతి -రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఎయిర్ లిఫ్ట్ -వారంలోనే అందుబాటులోకిజర్మనీ నుంచి ఆక్సిజన్ ప్లాంట్లు దిగుమతి -రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఎయిర్ లిఫ్ట్ -వారంలోనే అందుబాటులోకి

బాగ్దాద్‌లోని ఖతీబ్ ఆస్పత్రిలో

బాగ్దాద్‌లోని ఖతీబ్ ఆస్పత్రిలో

ఇరాక్ రాజధాని బాగ్ధాద్ సిటీ దక్షిణ ప్రాంతంలో దియాలా బ్రిడ్రి సమీపంలో గల ఇబ్న్ ఖతీబ్ ఆస్పత్రిలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పేలుడు సంభవించింది. దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతుండటంతో ఖతీబ్ ఆస్పత్రిని చాలా రోజుల కిందటే కొవిడ్ కేర్ సెంటర్ గా వినియోగిస్తున్నారు. దక్షిణ బాగ్దాద్ సిటీలో అతిపెద్ద కొవిడ్ ఆస్పత్రి ఇదే కావడం, నిత్యం వందల సంఖ్యలో రోగులు, వారి సహాయకులతో ప్రాంగణమంతా కిక్కిరి ఉండటం అక్కడ సాధారణ దృశ్యాలు. అలాంటి చోట క్రిటికల్ వార్డులో మంటలు చెలరేగి..

ఆక్సిజన్ ట్యాంక్ పేలుడుతో..

ఆక్సిజన్ ట్యాంక్ పేలుడుతో..

కరోనా సోకిన రోగుల్లో చాలా మందికి శ్వాసకోస ఇబ్బందులు తలెత్తుతుండటంతో ఖతీబ్ ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరాను పెంచారు. అందుకోసం అదనంగా ఆక్సిజన్ తెప్పించి, ఆస్పత్రిలోని ఓ ఫ్లోర్ లో ట్యాంకర్లు నిల్వ ఉంచారు. ఆక్సిజన్ ట్యాంకర్ల నిర్వహణలో మానవ తప్పిదాల కారణంగా అర్ధరాత్రి తర్వాత పేలుడు చోటుచేసుకుంది. దీంతో క్రిటికల్ కేర్ యూనిట్ ఉన్న ఫ్లోర్ మొత్తం మంటలు వ్యాపించాయి. ఆక్సిజన్ ట్యాంకర్ పేలుడు శబ్దం కొన్ని మీటర్ల వరకూ వినిపించడం, అగ్నికీలలకు కనిపించడంతో దియాలా బ్రిడ్జి ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రమాదం గురించి తెలియగానే..

కరోనా విలయం: షాకింగ్ రిపోర్ట్ -మే15 కల్లా పతాక స్థాయికి వైరస్ వ్యాప్తి -35లక్షల కేసులు -తగ్గేదెప్పుడు?కరోనా విలయం: షాకింగ్ రిపోర్ట్ -మే15 కల్లా పతాక స్థాయికి వైరస్ వ్యాప్తి -35లక్షల కేసులు -తగ్గేదెప్పుడు?

ఇప్పటికే 27 మంది మృతి..

ఇప్పటికే 27 మంది మృతి..

బాగ్దాద్ నగరంలోని ఖతీబ్ ఆస్పత్రిలో ఆక్సిజన్ ట్యాంక్ పేలి మంటలు చెలరేగిన ఘటనలో ఇప్పటి వరకు 27 మంది కొవిడ్ రోగులు చనిపోయినట్లు అధికార వర్గాలు ధృవీకరించాయి. అగ్నిప్రమాదంలో గాయపడ్డ మరో 50 మంది రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించారు. ఆక్సిజన్ ట్యాంక్ పేలుడు తర్వాత పదుల సంఖ్యలో ఫైరిజన్లు చేరుకుని మంటలను అదుపు చేశాయి. ఆస్పత్రిలోని క్రిటికల్ కేర్ యూనిట్ మొత్తం బూడిదైపోయింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.అధికారిక లెక్కల ప్రకారం ఇరాన్ లో ఇప్పటిదాకా నమోదైన మొత్తం 10,25,288 కేసులు నమోదుకాగా, 15,217 మరణాలు సంభవించాయి. అమెరికా యుద్ధం, సద్దాం హుస్సేన్ పతనం, ఐసిస్ వ్యాప్తి, మళ్లీ ఐసిస్ తో జాయింట్ ఆర్మీ పోరు.. ఇలా రెండు దశాబ్దాలుగా సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్న ఇరాన్ లో కొవిడ్ వ్యాప్తి తర్వాతే ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు మెరుగవుతున్నాయి. అంతలోనే ఇలాంటి పెను విషాదం చోటుచేసుకుంది.

English summary
At least 27 people were killed and 46 injured in a fire on Saturday at a hospital in southeastern Baghdad that had been equipped to house Covid-19 patients, medical sources at three nearby hospitals said. The fire at the Ibn Khatib hospital in the Diyala Bridge area of the Iraqi capital occurred after an accident caused an oxygen tank to explode, the sources said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X