వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐసిస్ ఘాతుకం: 300మంది ఉద్యోగుల హత్య

|
Google Oneindia TeluguNews

బాగ్దాద్: ఇరాక్‌లో ఐసిస్‌ ఉగ్రవాదులు మరో ఘాతుకానికి తెగపడ్డారు. ఏకంగా 300 మంది ఆ దేశ పౌరుల్ని దారుణంగా హత్యచేశారు. అక్కడి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఇరాక్‌ సుప్రీం ఎలక్టోరల్‌ కమిషన్‌లో పని చేస్తున్న 300 మంది ఉద్యోగుల్ని ఐసిస్‌ ఉగ్రవాదులు కాల్చి చంపారు.

నినెవెహ్‌ ప్రావిన్స్‌లోగల మోసూల్‌లో 50 మంది మహిళలను చంపారు. కమిషన్‌లో పని చేస్తున్న మొత్తం 300 మందిని చంపారని అధికారులు తెలిపారు. మరికొన్న చోట్ల కూడా ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు.

Iraq: ISIS executes 300 civil servants in Mosul

ఈ సందర్భంగా కమిషన్‌ ప్రతినిధులు మాట్లాడుతూ.. వెంటనే అంతర్జాతీయ, మానవహక్కుల సంఘాలు కల్పించుకొని ఈ దాడుల నుంచి ఇరాక్‌ పౌరుల్ని కాపాడాలని కోరారు.

తమ కుటుంబసభ్యులను హతమార్చినట్లు ఉగ్రవాదులు ప్రకటించారని, అయితే వారి మృతదేహాలను మాత్రం అప్పగించలేదని బాధితుల కుటుంబసభ్యులు తెలిపారు. మోసూల్‌పై పట్టుసాధించిన ఐఎస్ ఉగ్రవాదులు.. ఉత్తర ఇరాక్‌లోని ఇతర నగరాలను అక్రమించుకునేందుకు ఈ రకమైన దాడులకు దిగుతున్నారు.

అఫ్ఘాన్‌లో పేలుడు: 22మంది మృతి

ఆఫ్ఘనిస్థాన్‌లోని కుందుజ్ ప్రావిన్స్‌లో శనివారం అర్ధరాత్రి కారు బాంబు పేలుడు సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో 22 మంది మృతిచెందారు. ఖాన్ అబాద్ జిల్లాలో ఓ మిలిటెంట్ ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు.

ఈ ఘటనలో 19 మంది ప్రభుత్వ మద్దతుదారులైన మిలిషీయా సభ్యులు, ముగ్గురు స్థానిక పౌరులు మృతిచెందారని అక్కడి అధికారులు తెలిపారు. కాగా, తాలిబన్ మిలిటెంట్లే ఈ దాడికి పాల్పడినట్టు వెల్లడించారు.

English summary
A firing squad of the Islamic State terrorist group on Saturday executed at least 300 civil servants who worked for the Iraqi Supreme Electoral Commission at a military camp in Iraqi city of Mosul, according to witnesses and security officials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X