వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కూరగాయల మార్కెట్లో ఆత్మాహుతి దాడి, 11 మంది మృతి

బాగ్దాద్ శివారు సదర్ పట్టణంలోని ప్రధాన కూరగాయల మార్కెట్ అయిన జమీలా వద్ద ఆదివారం ఉదయం ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో దాదాపు 11 మంది మృతి చెందారు.

|
Google Oneindia TeluguNews

బాగ్ధాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ శివారు సదర్ పట్టణం బాంబుల మోతతో దద్దరిల్లింది. ప్రధాన కూరగాయల మార్కెట్ అయిన జమీలా వద్ద ఆదివారం ఉదయం ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో దాదాపు 11 మంది మృతి చెందారు. మరో 35 మంది గాయపడ్డారు.

ఎయిర్ పోర్టులో దుండగుడి కాల్పులు, 5గురి మృతి, అరెస్ట్ఎయిర్ పోర్టులో దుండగుడి కాల్పులు, 5గురి మృతి, అరెస్ట్

మార్కెట్ వద్ద ఓ కారులో ఉన్న ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతను పేలుడు పదార్థాలతో మార్కెట్లోకి వచ్చే ప్రయత్నం చేశాడు. దీంతో ఓ సైనికుడు అతడి పైకి కాల్పులు జరిపాడు. కాని అంతలోనే సదరు సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చుకున్నాడు.

ఈ ఘటనలో దాదాపు పదకొండు మంది చనిపోయారని, ముప్పై అయిదు మంది గాయపడ్డారని పోలీసు అధికారులు తెలిపారు. ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి పైన గన్‌తో కాల్పులు జరిపిన సైనికుడు కూడా గాయపడ్డారని చెప్పారు.

బాగ్దాద్‌ శివారులోని సదర్ పట్టణంలో జమీలా హోల్‌సేల్ కూరగాయల మార్కెట్. రాజధానికి దగ్గరగా ఉన్న ఈ నగరాగన్ని ఉగ్రవాదులు పదేపదే టార్గెట్ చేసుకుంటున్నారు. ఈ కాల్పులకు తామే కారణం అని ఇంకా ఎవరూ ప్రకటించలేదు.

English summary
A police colonel and a hospital official said at least 11 people were killed and 35 wounded.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X