వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

400 మంది చావుకి కారణమైన సమంతా అలియాస్ 'వైట్ విడో'

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఐర్లాండ్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ మహిళా టెర్రరిస్ట్ సమంతా ల్యూత్ వైట్ 400 మంది అమాయకులు మరణించడానికి కారణమని కెన్యా సెక్యూరిటీ ఛీప్ వెల్లడించారు. సమంతా ల్యూత్ వైట్ ముద్దు పేరు వైట్ విడో.

32 ఏళ్ల సమంతా సోమాలియాకు చెందిన జిహాదీ ఉగ్రవాద సంస్ధ అల్ షబాబ్‌లో కీలక సభ్యురాలిగా ఎదిగిన తర్వాత పలు దాడులకు పథక రచన చేసిందని 'మిర్రర్ ఆన్ లైన్' మీడియా సంస్ధ పేర్కొంది. సోమాలియా, కెన్యా దేశాల్లో యువతులు, మహిళలను ఉగ్ర సంస్ధల్లో చేర్పించడంలో కీలక పాత్ర పోషించేదన్నారు.

కెన్యా అధికారిక భద్రాత నివేదికల ప్రకారం.... యువతులు, మహిళలను ఆత్మాహుతి దాడులు, కారు బాంబు పేలుళ్లలో పాల్గొనేలా చేసి, వారి కుటుంబాలకు కేవలం కొన్ని వందల యూరోలను మాత్రమే చెల్లించేది. గత నెలలో కెన్యాలో ఓ యూనివర్సిటీలో జరిగిన దాడిలో 148 మంది మృతి చెందిన ఘటనకు సమంతానే బాధ్యురాలని భావిస్తున్నట్లు తెలిపింది.

 Irish-born ‘White Widow’ Samantha Lewthwaite ‘mastermind of 400 murders’ – report

సోమాలియాకు చెందిన నేషనల్ ఇంటిలిజెన్స్ అండ్ సెక్యూరిటీ ఏజెన్సీ ప్రకారం నలుగురు బిడ్డలకు తల్లైన సమంతా లండన్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ చేస్తున్న సమయంలో ఉగ్రవాద బాట పట్టింది. ప్రస్తుతం సమంతా ఉగ్రవాద సంస్ధ అల్ షబాబ్‌లో కీలకంగా మారారు.

కాగా, సమంతా భర్త జెర్మైన్ లిండ్సే కూడా తీవ్రవాదే. 2005 లండన్ దాడులకు పాల్పడిన వారిలో లిండ్సే కూడా ఉన్నాడు. లండన్‌లో జరిగిన ఈ ఆత్మాహుతి దాడుల్లో ట్రైన్‌ను పేల్చిన లిండ్సే, ఆ తర్వాత తాను కూడా హతమయ్యాడు. అందుకే సమంతాను 'వైడ్ విడో' అని పిలుస్తుంటారు.

English summary
IRISH born Samantha Lewthwaite has murdered 400 people during her campaign with jihadist terror group al Shabaab.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X