వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిడ్నీ కేఫ్‌లో బంధించబడ్డ వారిలో ఇండియన్స్, తప్పించుకున్న ఐదుగురు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

సిడ్నీ: ఆస్ట్రేలియా నగరం సిడ్నీలోని మార్టిన్ ప్లెన్‌లోని ఓ కేఫ్‌లో అగంతకుడు 12కు పైగా మందిని సోమవారం ఉదయం నిర్బంధించాడు. వెంటనే స్పందించిన న్యూ సౌత్ వేల్స్ పోలీసులు కేఫ్‌ను చుట్టుముట్టారు. పోలీసులు ఆ కేఫ్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

కేఫ్ పరిసరాల్లో ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. బందీలను విడిపించేందుకు అన్ని చర్యలను తీసుకుంటున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ తెలిపారు. కాగా, వారిని ఇస్లామిక్ స్టేట్ గన్‌మెన్ బంధించినట్లుగా భావిస్తున్నారు. ఆ కేఫ్ పేరు లాండ్ట్ చాకోలేట్ కేఫ్.

IS gunman take several people hostage at cafe in Sydney

ఈ కేఫ్ కిటికీ ద్వారా బంధించబడిన వారిలో ముగ్గురు బయటకు కనిపిస్తున్నారు. ఈ ప్రాంతం బిజీగా ఉండే ప్రాంతం. ఆ కేఫ్ పైన ఇస్లామిక్ స్టేట్ జెండాను ఉంచారని టీవీ రిపోర్ట్స్ చెబుతున్నాయి. దీంతో వారు ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన ఉగ్రవాదులుగా భావిస్తున్నారు.

కాగా, బందీల్లో ఐదుగురు తప్పించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. బందీల్లో భారతీయులు కూడా ఉన్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ఇండియన్ కాన్సులేట్లో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు.

కలచివేస్తోంది: మోడీ

ఆస్ట్రేలియా సిడ్నీ నగరంలోని ఓ కేఫ్‌లో పన్నెండుమందికి పైగా దుండగుడు బంధించడం ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. ఆయుధాలు ధరించిన ఆ వ్యక్తి వీరందరిని బంధించాడని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన పైన భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు.

IS gunman take several people hostage at cafe in Sydney

విద్రోహ శక్తుల చేతిలో సామాన్యులు ప్రాణాపాయస్థితిలో ఉండటం కలచివేస్తోందని ఆయన ట్వీట్ చేశారు. ఈ ఘటన మానవత్వానికి మచ్చతెచ్చేలా ఉందన్నారు. బంధీలుగా ఉన్న ప్రతి ఒక్కరు క్షేమంగా బయటపడాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు.

IS gunman take several people hostage at cafe in Sydney
English summary
Several people were today taken hostage at a cafe in Sydney apparently by at least one Islamic State gunman, media reports said. At least 3 people could be seen through the windows of the Lindt Chocolat Cafe in Martin Place, a busy tourist and shopping district in central Sydney, with their hands raised, state-run ABC television reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X