వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికన్ యువతిపై పలుమార్లు ఐసిస్ నేత రేప్

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఓ యువతిని ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదులు పలుమార్లు అత్యాచారం చేసి చంపేశారు. ఐసిస్‌కు చెందిన ఓ నాయకుడు ఆమెను పలుమార్లు అత్యాచారం చేశాడు. ఐసిస్ ఉగ్రవాదులు బందీల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

ఇటీవల అమెరికాకు చెందిన మానవ హక్కుల కార్యకర్త కేలా మ్యుల్లర్ (27) ఏళ్ల యువతిపై ఐఎస్ నేత అబూబాకర్ అల్ బాగ్దాదీ ఏకంగా పెళ్లి పేరిట పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

రెండేళ్ల క్రితం సిరియాలోని ఓ ఆసుపత్రి నుంచి మ్యుల్లర్‌నూ, ఆమె స్నేహితుడిని ఐసిస్ ఉగ్రవాదులు అపహరించారు. రెండు నెలల అనంతరం మ్యుల్లర్ స్నేహితుడిని విడిచిపెట్టిన ఉగ్రవాదులు ఆమెను తమకు నిధులు సమకూర్చే అబూ సయ్యఫ్ ఇంట్లో కొంతకాలం బందీగా ఉంచారు.

IS leader Baghdadi repeatedly raped US hostage

అక్కడికి తరచుగా వచ్చే బాగ్దాదీ ఆమెపై లైంగిక దాడికి పాల్పడేవాడని, మ్యుల్లర్‌తో పాటు బందీగా ఉన్న మరో ఇద్దరు యాజ్దీ తెగ టీనేజ్ బాలికలు తెలిపారు. అమెరికా డెల్టా ఫోర్స్ దళం దాడిలో అబూ సయ్యఫ్ మరణించగా అతని భార్య ఉమ్ సయ్యఫ్ బందీగా చిక్కింది.

ఆమెను విచారణ జరిపినప్పుడు కూడా మ్యుల్లర్‌పై లైంగిక దాడి జరిగినట్టు తెలిపిందని అమెరికా సైనికాధికారులు చెప్పారు. జోర్డాన్ దళాల వైమానిక దాడిలో మ్యుల్లర్ మరణించిందని ఐఎస్ ప్రకటించింది.

'అమెరికా, మిత్రపక్షాలపై దాడి చేయండి'

అమెరికా, దాని మిత్ర పక్షాల పైన ఆత్మాహుతి దాడులు చేయాలని అల్ ఖైదా మద్దతుదారులకు ఒసామా బిన్ లాడెన్ తనయుడు హమ్జా పిలుపునిచ్చాడు. జీహాదీల యుద్ధాన్ని మధ్యప్రాచ్యం నుంచి అమెరికా, యూదు అమెరికన్ల వైపునకు తిప్పవలసిన సమయం వచ్చిందన్నాడు.

English summary
The IS leader Abu Bakr al Baghdadi viewed women held captive at a Syrian house as his private property, and forced himself upon a number of them, including the American hostage Kayla Mueller.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X