వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మలేసియాలో తలదాచుకున్న జకీర్ నాయక్!? పౌరసత్వం కూడా, భారత్ కు తప్పుడు సమాచారం
కౌలాలంపూర్: ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్ మలేషియాలో తలదాచుకున్నట్టు వెల్లడైంది. శుక్రవారం జకీర్ నాయక్ మలేసియాలోని ఓ మసీదుకు వెళ్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మసీదుకు ఐరన్ మాస్క్ అనే పేరు కూడా ఉంది.
మసీదులో ప్రార్థనల అనంతరం మధ్యాహ్నం 2.20 గంటలకు జకీర్ నాయక్ ఫొటోను డాక్టర్ మహ్మద్ సయీద్ తన ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలు, మనీ లాండరింగ్ కేసుల్లో జకీర్ నాయక్ నిందితుడిగా ఉన్నాడు.

జకీర్ కు సౌదీ అరేబియా పౌరసత్వం ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఐదేళ్ల క్రితమే మలేసియా కూడా అతడికి పర్మినెంట్ రెసిడెంట్ స్టేటస్ ఇచ్చినట్టు సమాచారం. మరోవైపు అతడి పాస్ పోర్టును భారత ప్రభుత్వం రద్దు చేసింది.
జకీర్ నాయక్ ను తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం కోరినప్పటికీ... ఆయన తమ దేశంలో లేరంటూ మలేసియా తెలిపింది.