వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

5జీ నెట్‌వర్క్ కారణంగా తుపాన్ల సమాచారం అందకపోయే ప్రమాదం ఉందా

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
శాటిలైట్

ఉపగ్రహాల నుంచి వచ్చే వాతావరణ సూచనలకు అమెరికాలో 5జీ మొబైల్ డాటా నెట్‌వర్క్ ఆటంకాలు కలిగించే ప్రమాదం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

5జీ తరంగాల వల్ల కలిగే అంతరాయంపై గతంలోనూ వాతావరణ నిపుణులు పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం దీనిపై పరిశోధనలు చేసే కొన్ని సంస్థలు కలిసి ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ (ఎఫ్‌సీసీ)కు ఉమ్మడి లేఖ రాశాయి.

ఈ లేఖలో "పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని" వివరించినట్లు 'ది రిజిస్టర్' వార్తా సంస్థ పేర్కొంది.

5జీ వినియోగాన్ని వాయిదా వేయడానికి రేడియో స్పెక్ట్రంను వేలంపాటకు పెట్టాలని సూచించినట్లు తెలుస్తోంది.

5జీ నెట్‌వర్క్ వల్ల కమ్యూనికేషన్ కార్యకలాపాలు అధికమై, ముఖ్యమైన వాతావరణ సమాచారం అందించడంలో అంతరాయం కలగొచ్చని అమెరికన్ జియోఫిజికల్ యూనియన్, అమెరికన్ మెటియరాలజీ సొసైటీ, ది నేషనల్ వెదర్ అసోసియేషన్ పేర్కొన్నాయి.

ఈ అంతరాయాల వల్ల హరికేన్ వచ్చే సమయంలో వాతావరణ సమాచారం అందించడం ఆలస్యమైతే భారీ నష్టం జరగొచ్చని ఆ సంస్థలు ఆందోళన వ్యక్తంచేశాయి.

వాతావరణ సమాచారాన్ని అందించే నెట్‌వర్కులు "ప్రజల భద్రతకు, సైన్స్ పరిశోధనలకు చాలా ముఖ్యమని" వారు పేర్కొన్నారు.

"కొన్ని క్షణాలు ఆలస్యమైనా సరే భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగవచ్చని" ఆక్యువెదర్ కార్యనిర్వాహక అధ్యక్షుడు జోనాథన్ పోర్టర్, ఎఫ్‌సీసీకి రాసిన ఒక ప్రత్యేక లేఖలో తెలిపారు.

ఉపగ్రహాలు, భూమి తాలూక చిత్రాలను కాంతిపుంజం రూపంలో వాతావరణ నిపుణులకు పంపిస్తాయి. అంతేకాకుండా, వేలకొద్దీ భూఆధారిత సెన్సర్ల నుంచి సేకరించిన సమాచారాన్నీ అందిస్తాయి.

5జీ ప్రయోజనాల కోసం 1,675 - 1,680 MHz బ్యాండ్ స్పెక్ట్రం వినియోగించబోయే సంస్థ లిగాడో నెట్వర్క్స్ ఎఫ్‌సీసీకి రాసిన లేఖలో..."ఈ బ్యాండ్ పరిథిలో 5జీ వినియోగాన్ని అనుమతించకపోతే 5జీ సేవలను సమర్థంగా అందించలేమని, ఇలా అయితే 5జీ పోటీలో యూఎస్ వెనుకబడిపోతుందని" తెలిపింది.

5జీ సేవలను నిలిపివేసే బదులు వాతావరణ నిపుణులు ఇంటర్నెట్ సర్వీసులు ఉపయోగించి వాతావరణ సమాచారాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చని ఈ సంస్థ చెబుతోంది.

5జీ

అయితే, ది నేషనల్ ఓసియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్…ఇలాంటి సాంకేతికత ఎంత త్వరగా భూమి పూర్తి చిత్రాలను (ఫుల్ డిస్క్ ఇమేజరీ) అందించగలదో పరిశీలించగా, చాలా నెమ్మదిగా అందిస్తున్నాయని తేలింది.

"2019 ప్రారంభంలో అందించిన ఫుల్ డిస్క్ చిత్రాలు, ఇతర చిత్రాలు తరచుగా మూడు నుంచీ ఏడు నిముషాలు ఆలస్యమవుతూ వచ్చాయని, సమయానుకూలంగా వాతావరణ సమాచారాన్ని అందించడానికి ఇవి సరిపోవని" మూడు వాతావరణ సంస్థలు ఎఫ్‌సీసీకి రాసిన ఉమ్మడి లేఖలో పేర్కొన్నాయి.

ఎంత అంతరాయం కలుగుతుంది అనేది ఎక్కడెక్కడ కొత్త 5జీ నెట్వర్కులు పుట్టుకొస్తాయి అనేదానిపై ఆధారపడి ఉంటుందని 'ది 5జీ మిథ్' పుస్తక రచయిత ప్రొఫెసర్ విలియం వెబ్ తెలిపారు.

నగరం కేంద్రాలలో మాత్రమే ఏర్పాటు చేస్తే అంతరాయం ఉండకపోవచ్చు. కానీ వాతావరణ సమాచారం సేకరించే ప్రాంతాల్లో పెద్ద స్థాయిలో ఏర్పాటు చేస్తే అంతరాయం కలగొచ్చని ప్రొఫెసర్ వెబ్, బీబీసీకి తెలిపారు.

మొబైల్ నెట్వర్క్ ఆపరేషన్లకు ప్రాతినిధ్యం వహించే సంస్థ ది జీఎస్ఎంఏ స్పందిస్తూ...5జీ సేవలు, వాతావరణ సమాచరం అందించే సర్వీసులు ఒకదానికొకటి అడ్డంకి కావని తాము భావిస్తున్నట్లు తెలిపింది.

"ఇలాంటి భయాలు పుట్టించడం ద్వారా 5జీ నెట్వర్క్ వలన పొందగలిగే సాంఘిక, ఆర్థిక ప్రయోజనాలను నిరోధించలేరని" జీఎస్ఎంఏ అధ్యక్షులు బ్రెట్ టార్‌న్యూట్జర్ తెలిపారు.

"అందరూ వాస్తవాలను పరిశీలించాలని, తప్పుదోవ పట్టించే వాదనలను పక్కన పెట్టాలని కోరుతున్నాం" అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
There might be a hurricane data loss due to 5G network
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X