వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ విజయం భారత్ కు కోలుకోలేని దెబ్బేనా

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్ :అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం భారత్ పై తీవ్రంగా కనిపించే అవకాశాలున్నాయి. ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రంప్ చేసిన ప్రచారం భారత్ వాసులను కలవరపెడుతోంది. దేశంలోని ఐటి పరిశ్రమలు ఒడిదొడుకులను ఎదుర్కొనే అవకావం కన్పిస్తోంది.

అమెరికా అద్యక్ష ఎన్నికల్లో అనుహ్యంగా డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. ఈ విజయం ప్రభావం భారత్ మార్కెట్ ను కుప్పకూల్చింది. సెన్సెక్స్ ప్రారంభంలో 1700 పాయింట్లు పడిపోయింది. రానున్న రోజుల్లో అమెరికా ప్రభుత్వం భారత్ తో ఏ రకంగా వ్యవహారిస్తోందననే చర్చ సర్వత్రా సాగుతోంది.హిల్లరీ విజయం సాధిస్తే భారత్ తో మంచి సంబంధాలను కొనసాగించే వారని అభిప్రాయాలున్నాయి. కాని ట్రంప్ విజయం భారత్ కు నిరాశకల్గిస్తోంది.

is there any effect on india markets from trump

గతంలో తీసుకొన్న నిర్ణయాలను సమీక్షిస్తానని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో చెప్పాడు. కొన్ని సందర్భాల్లో ఆయన చేసిన ప్రకటనలు వివాదంగా మారాయి. భారత్ ను ఉద్దేశించి ఆయన తీవ్రంగానే తన ప్రచారాన్ని సాగించారు. భారత్ లో ఉన్న ట్రేడ్ డీల్స్ పై ఈ ప్రభావం ఉండే అవకాశం లేకపోలేదని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.అమెరికాలో ఉద్యోగాల కోసం వెళ్ళే వారికి ఇక ఇబ్బందులు ఉండవచ్చనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.అయితే ట్రంప్ ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయాలు తీసుకొంటారనే దానిపై ఆదారపడనున్నాయి.

హెచ్ 1 బీ వీసాల ప్రోగ్రామ్ ను ఎన్నికల ప్రచారంలో ట్రంప్ లక్ష్యంగా చేసుకొన్నాడు. ఈ ప్రోగ్రామ్ ను నిలిపివేస్తానని హామీ ఇచ్చాడు. అమెరికన్లు ఎక్కువగా ఉద్యోగాలు కోల్పోవడానికి ఇండియన్లు ఎక్కువ కారణమని ట్రంప్ అభిప్రాయంగా కన్పిస్తోంది. ఇదే జరిగితే దేశంలోని ఐటి పరిశ్రమలకు ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. ఇండియన్లతో పాటు సింగపూర్,చైనా వాసులు కూడ అమెరికన్లకు ఉద్యోగాలు దక్కుండా అడ్డుపడుతున్నారని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. ఈ ప్రచారం స్థానిక అమెరికన్లలో కొత్త ఆశలను నింపింది. భారత్ కు మాత్రం ఇబ్బందులను తెచ్చిపెట్టేలా చేసింది.

ట్రంప్ గెలుపు వల్ల నష్టాలతో పాటు లాభాలు కూడ ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కఠినమైన ఇమ్మిగ్రేషన్ రూల్స్ ను తేవాలని ట్రంప్ భావిస్తున్నారు. అదే సమయంలో విధ్యార్థులు, వ్యాపారుల మనసుల గెలుచుకొనేందుకు ప్రయత్నం చేశాడు ట్రంప్.అగ్రరాజ్యం అమెరికా చైనాకు మద్య పొసగదు. చైనా ను ఎదుర్కోవాలంటే ఇండియాతో తప్పనిసరిగా స్నేహం కొనసాగించాల్సిన పరిస్థితులు అమెరికాకు ఉన్నాయి.ట్రేడ్ అగ్రిమెంట్లకు చైనా సహాకరించకపోతే చైనా కరెన్సీని మానిప్యులేటర్ కు పాల్పడుతోందని నిందవేసి పన్ను విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు.

English summary
an american 45th president trump won. trump elect as an american president is effect indian market. all trade deals review said in election campign trump.h1b veesa programme targeted by trump. includint indiansm chines, singapore people were get job oppertunities in america,so trump target that progarm. china is not friendly country to america, this is only the fact trump to cooperate to india ssid analysists.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X