వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇదేమైనా జోకా?: కరోనా వచ్చిందంటూ మాస్క్ తీసేసిన దేశాధ్యక్షుడు, ప్రజల ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

సావోపాలో: కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి అనేక జాగ్రత్తలు తీసుకుంటుంటే.. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో మాత్రం దాన్ని అంత సీరియస్‌గా తీసుకున్నట్లు లేరు. తనకు కరోనా పాజిటివ్ ఉందంటూనే.. తన ముఖానికున్న మాస్కును తీసేశారు. దీంతో అక్కడున్నవారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు.

కరోనా వచ్చిందంటూ మాస్కు తీసేశాడు..

తనకు కరోనా పాజిటివ్ వచ్చిందంటూ బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో మీడియా ప్రతినిధుల ముందుకు వచ్చి చెప్పారు. అయితే, కాసేపటికే తన ముఖానికి ఉన్న మాస్కును తీసేసి కొంచెం దూరంగా ఉండి మాట్లాడారు. దీంతో మీడియా ప్రతినిధులంతా ఆందోళనకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తాను మామూలుగానే ఉన్నానంటూ..

కాగా, మూడుసార్లు పరీక్షలు చేస్తే నెగిటివ్ రాగా.. నాల్గవసారి నిర్వహించిన పరీక్షలో మాత్రం అధ్యక్షుడు బోల్సోనారోకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయంపై మాట్లాడేందుకు మీడియా ముందుకు వచ్చారు ఆయన. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను మామూలుగానే ఉన్నానని, కొద్దిగా ఫ్లూ జ్వరం వస్తే ఎలా ఉంటుందో అలాగే ఉందని తెలిపారు. ఇక్కడే నడవాలని ఉంది, కానీ, వైద్యుల సూచన మేరకు అలా చేయలేకపోతున్నానని చెప్పారు.

కరోనా అంటే జోకా..?

ఈ సమయంలోనే మాస్కు తీయడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
దేశంలో కరోనాను అరికట్టడంలో విఫలమయ్యారంటూ ఇప్పటికే విమర్శలతో విరుచుకుపడుతున్న ప్రజలు.. ఈ ఘటనతో మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా అంటే అధ్యక్షుడికి జోకా? అంటూ మండిపడుతున్నారు. ఇప్పటికే కరోనా నియంత్రణకు మాస్కులు, లాక్‌డౌన్‌లు అవసరం లేదంటూ అతనే పదే పదే ఉల్లంఘిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు.

Recommended Video

అమెజాన్‌ అడవుల్లో కార్చిచ్చు || Brazil Sends Army To Help Tackle Flares In Amazon Forest || Oneindia

మాస్కు లేకుండానే అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొన్న అధ్యక్షుడు..

దేశాధ్యక్షుడైన మాస్కులు ధరించాలన్న అత్యున్నత న్యాయస్థానం తీర్పును కూడా ఉల్లంఘించారంటూ మండిపడుతున్నారు. అంతేగాక, కరోనా వచ్చిన ఆయన ఇటీవల మాస్కు లేకుండానే పలు అధికారిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం గమనార్హం. దీంతో ఎవరెవరికి కరోనా అంటుకుందో అనేది తేలాల్సి ఉంది. కాగా, ప్రపంచంలో అమెరికా తర్వాత కరోనా కేసులు అత్యధికంగా ఉన్న దేశం బ్రెజిలే కావడం గమనార్హం. ఇప్పటి వరకు బ్రెజిల్ దేశంలో 1,674,655 కేసులు నమోదు కాగా, 66,868 మంది మరణించారు.

English summary
Brazil's President Jair Bolsonaro on Tuesday announced that he had tested positive for coronavirus but said he was feeling "perfectly well" and had only mild symptoms.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X